అధికారులు సమన్వయము తో పని చేయాలి: పార్థసారథి

Date:18/08/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
రైతు భీమా పథకం రైతు సంక్షెమం కోసం రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమమని అందరు అధికారులు సమన్వయము తో పని చేయాల్సిన అవసరం వుందని వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సి.పార్థసారథి అన్నారు.శనివారం జీవిత భీమ సంస్థ జోనల్ కార్యాలయం లో రైతు భీమా పథకం పై సమీక్ష నిర్వహించారు.
 ఈ సందర్బంగా భీమా సెటిల్ మెంట్, భీమా క్లేయిమ్ లు, సత్వర చెల్లింపులు పై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిపారు. మరియురైతు భీమాని క్లేయిమ్ చేయుటకుఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులని చర్చించారు.ఈ సందర్బంగా పార్థ సారథి మాట్లాడుతూ ఏదైన ఇబ్బందులు వుంటే సత్వరంగా సమన్వయంతో  పరిష్కరించుకోవాలని కోరారు.
ఈ పథకం అమలు చేసే క్రమంలో కొన్ని నిర్ణయాలు తీసుకొనే అవసరం ఉన్నందున ఎల్ఐసి వారుఆ నిర్ణయాలను  రీజినల్ ఆఫీస్ స్థాయిలో  తీసుకొనే విధంగా వుండాలని కోరారు.ఈ సమీక్షలో ఏఇఓ లు ఎంఐసి పోర్టల్ లో అప్లోడ్ చేసిన రైతు భీమా డేటాని, ధ్రువపత్రాలను ఏ విధంగా విశ్లేషించి, సత్వర క్లేయిమ్ లను రైతులకు అందిస్తారో సమీక్షించారు.
రైతు భీమా డేటా, ధ్రువపత్రాలను పొందుపరచటంలో గల సాంకేతిక ఇబ్బందులను ఏ విధంగా అధిగమించాలో పలు సూచనలు చేసారు. ఏపీజీవీవీ   బ్యాంకు వారు నూతనంగా ఐఎఫ్సీ కోడ్లను ఏర్పాటు చేసుకొనుచున్నారు కావున ఆ బ్యాంకు నందు గల క్లెయిమ్ చెల్లింపులో ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నందున నామిని లబ్దిదారులు వేరే బ్యాంకు నందు ఖాతా తెరిచి వ్యవసాయ అధికారులకు తొందరగా సమర్పించాలని విజ్ఞప్తి చేసారు.
సత్వర చెల్లింపు కై రైతు భీమా క్లేయిమ్ చేసినప్పుడు  క్లేయిమ్  నెం మరియు క్లేయిమ్  ఇంటిమేషన్నెం నుతప్పనిసరిగా పొందుపరచాలని ఎల్ఐసి వారు తెలియజేసారు.వ్యవసాయ శాఖ సిబ్బంది రైతు భీమా ని క్లేయిమ్ చేస్తున్నప్పుడు పొందుపరుస్తున్నటువంటి ధ్రువపత్రాలు క్లారిటీ తో స్కాన్ చేసిఅప్లోడ్ చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వం ఈ పథకాన్ని పట్టదారులకు కూడా వర్తింప చేస్తున్నందున సదరు పట్టాదారు యొక్క ఆధార్ నెం ను తప్పని సరిగా భీమా కొరకు జత పరచాలని  తెలిపారు. జిల్లా లోని నోడల్ ఆఫీసర్లు రైతు భీమా సత్వర క్లెయిమ్ కొరకు నిరంతరంగా, త్వరితగతిన రైతుల యొక్క ధ్రువపత్రాలను పోర్టల్ నందు పొందుపరచాలనిఆదేశించారు.
ఈ కార్యక్రమంలో చందర్ రీజినల్ మేనేజర్నరసింహం డివిజనల్ మేనేజర్, సుబ్రహ్మణ్యం డివిజనల్ మేనేజర్, రజని అహుజా అసిస్టెంట్ డివిజనల్ మేనేజర్, ఉన్నతాధికారులు, టెక్నికల్ డైరెక్టర్ సురేష్ కుమార్, సిబ్బంది మరియు వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ విజయ్ కుమార్, డిప్యూటీ మరియుఅసిస్టెంట్ డైరెక్టర్లు పాల్గొన్నారు.
Tags: The authorities should work with coordination: Parthasarathy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *