అయ్యప్ప ఆచారాలు కాపాడాలి

Date:08/10/2018
విశాఖపట్నం  ముచ్చట్లు:
కేరళలోని శబరిమల ఆలయ ఆచారాలను కాపాడాలంటూ శ్రీ అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో విశాఖలో ఆయ్యప్ప భక్తులు సోమవారం ప్రదర్శన నిర్వహించారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల మీదుగా ఈ ప్రదర్శన సాగింది. సేవ్ శబరిమల అంటూ భక్తులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గురుస్వామి శ్రీరామ్భగవతి మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని కాపాడటానికి మాత్రమే ఈ నిరసన తెలుపుతున్నామన్నారు. మహిళలు ఆలయంలో ప్రవేశించవద్దని ఎవరూ అనలేదని, సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పిందన్నారు. ఈ తీర్పును కొంత మంది తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. రుతుక్రమంలో ఉన్నప్పుడు మాత్రమే మహిళలు ఆలయంలోకి ప్రవేశించకూడదన్నారు. ఆలయానికి మా పిల్లలు, మాలికాపురత్తమ్మలను కూడా తీసుకెళ్లామన్నారు. హిందూ ధర్మ, ఆచారాలను కాపాడటానికే ఈ నిరసన చేపట్టామన్నారు.
Tags:The Ayyappa rituals should be protected

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *