అయ్యప్ప స్వామి భక్తులు గమనించవలసిన ముఖ్య విషయాలు

The Ayyappa Swami devotees are important things to note

The Ayyappa Swami devotees are important things to note

Date:17/09/2018

శబరిమల ముచ్చట్లు:

శబరిమల యాత్ర కు వెళ్లు అయ్యప్పలకు,భక్తులకు దేవస్థానం వారి విజ్ఞప్తి………….

1. ప్రైవేట్ వాహనాలు “నిలక్కల్”వరకు మాత్రమే అనుమతి.

2. “నిలక్కళ్” నుండి “పంబ” వరకు . కేరళ రాష్ట్ర RTC బస్సుల ద్వారా మాత్రమే ప్రయానించవలేను. ఆ బస్        లో కండక్టర్ ఉండరు…కావున కూపన్ కొని బస్ లో ప్రయానించవలెను.

3. మీరు పంబ చేరిన తర్వాత త్రివేణి బ్రిడ్జి అయ్యప్ప వారధి (కొత్తగా నిర్మించిన) మీదుగా
సర్వీస్ రోడ్డు ద్వారా కన్నిమూల గణపతి ఆలయం చేరుకోవాలి.

4. పంబ నుండి కాలినడక వంతెన మూసివేయబడింది (గమనించగలరు).

5. త్రివేణి నుంచి “ఆరాట్టు కడావు” వరకు గల ప్రదేశాలు మట్టి బురద తో నిండి ప్రమాడపూరిటంగా
వున్నాయి కావున ఎవ్వరూక్రిందికి దిగరాదు.

6. పంబలో భక్తులకు కేటాయించిన ప్రదేశాలలో మాత్రమే స్నానం చేయాలి. మిగిలిన ప్రదేశాలలో
స్నానం చేయరాదు.

7. సెక్యూరిటీ సిబ్బంది ఆదేశాలను తప్పనసరిగా పాటించాలి. పంబ పోలీసుస్టేషన్ ముందు ప్రదేశం
పూర్తిగా దెబ్బతింది. కావున ఆ మార్గం గుండా కొండ పై కి ఎక్కరాదు.

8. పంబ పెట్రోల్ బంక్ నుండి “u” టర్నింగ్ పూర్తిగా దెబ్బతింది. కావున ఆ ప్రాంతం పూర్తిగా
మూసివేయబడింది.

9. పంబ పరిసరాలు, అడవి దారిలో ప్రమాదకరమైన “పాములు” బాగా సంచరిస్తున్నందువల్ల జాగ్రత్త గా
వుండాలి.

10. అనుమతి లేని దారుల ద్వారా కొండ ఎక్కరాధు.

11. త్రాగు నీటిని వెంట తీసుకెళ్లాలి.

12.ప్లాస్టిక్ వస్తువులను వాడరాదు

13. భోజనం, టిఫిన్స్ స్టాల్ నీలక్కల్ లో కలవు.

14. ఇరుముడి లో ప్లాస్టిక్ కవర్లు,వస్తువులు ఉండరాదు

15. మీ కు అవసరమైన కొద్దిపాటి తినుబండారాల తెచ్చుకోవాలి

16. మంచినీటి కొరత వల్ల నీటిని వృదాచేయరాధు ( నీటి పైపు లు పాడైన కారణంగా).

17. ఇటీవల వరదల కారణంగా నీలక్కళ్. పంబ. సన్నిధానం ప్రాంతాల్లో మరుగుదొడ్లు
పాడైపోవటం వల్ల నియమిత మరుగుదొడ్ల ను వాడుకోవాలి.

పైన చెప్పినవన్నీ devaswom board వారి ఉత్తర్వుల ను అందరూ పాటించి స్వామి అయ్యప్ప వారి క్షేత్రం లో క్రమశిక్షణ తో ప్రయాణించి స్వామి అయ్యప్ప వారి కృపా కటాక్షాన్ని పొందగలరు.

ప్రముఖ నటుడు, దర్శకుడు కెప్టెన్ రాజు కన్నుమూత

Tags:The Ayyappa Swami devotees are important things to note

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *