సుహాసిని కోసం బాబులు ఒక్కటవుతున్నారు

The bags are for the suhasini

The bags are for the suhasini

Date:26/11/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
ఇటీవల సినీ నటుడు జగపతిబాబు అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబుని కలిశారు. అయితే ఈ సిట్టింగ్ వెనుక రాజకీయ వ్యూహం ఏం లేదని.. ఓ వ్యాపార సంస్థ ప్రారంభోత్సవానికి చంద్రబాబును ఆహ్వానించేందుకే అమరావతి వచ్చినట్టు చెప్పుకొచ్చారు. అయితే పొలిటికల్ మాస్టర్ మైండ్ ఉన్న చంద్రబాబుతో సిట్టింగ్ అంటే రాజకీయ వ్యూహం లేకుండా ఉండదనేది తాజా పరిణామాలను బట్టి అర్ధమౌతోంది. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు ఏపీ సీఎం చంద్రబాబు. సినీ రాజకీయ వర్గాల్లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న నందమూరి ఫ్యామిలీ నుండి స్వర్గీయ నందమూరి హరిక్రిష్ణ కుమార్తె నందమూరి సుహాసిని అలియాస్ చుండ్రు సుహాసినిని కుక్కట్ పల్లి స్థానంలో తెరపైకి తీసుకువచ్చారు. ఇప్పటికే నందమూరి హీరోలు బాలయ్య, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్నలు సుహాసిని విజయానికి రంగంలోకి దిగారు. తాజాగా జగపతిబాబు సైతం సుహాసినికి సపోర్ట్‌గా నిలిచారు. సమస్యలపై స్పందించే గుణం నందమూరి ఫ్యామిలీ ఉందని.. అలాంటి ఫ్యామిలీ నుండి వచ్చిన సుహాసినికే తన మద్దతు అని, ఆమె ఈ ఎన్నికల్లో గెలవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు జగపతి బాబు. కాగా జగపతిబాబు చాలా ఏళ్లుగా కూకట్ పల్లిలో ఓ లగ్జరీ ఫ్లాట్‌లో ఫ్యామిలీతో కలిసి నివాసం ఉంటున్నారు. దీంతో స్థానికుడిగా తన మద్ధతుని ప్రకటించారు జగపతి బాబు. నందమూరి ఫ్యామిలీ హీరోల సినిమాల్లో ప్రతి నాయకుడిగా నటిస్తూ.. బ్లాక్ బస్టర్ హిట్‌లలో పాలుపంచుకుంటున్న జగపతి బాబు సుహాసిని విజయంలో ఎలాటి భూమిక పోషిస్తారనేది ఆసక్తిగా మారింది.
Tags:The bags are for the suhasini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *