Natyam ad

పుంగనూరులో పోలీసులపై దాడికి నిరసనగా చేపట్టిన బంద్‌ ప్రశాంతం

-మోటారు సైకిల్‌ ర్యాలీ
– బాబుకు వ్యతిరేక నినాదాలు

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

తెలుగుదేశం గూండాలు పోలీసులపై చేసిన దాడికి నిరసనగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన బంద్‌ పుంగనూరులో స్వచ్చంధంగా నిర్వహించారు. శనివారం మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము, పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, నియోజకవర్గ పరిశీలకుడు జింకా వెంకటాచలపతి ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహించారు. వ్యాపారులు స్వచ్చంధంగా దుకాణాలు మూసివేసి బంద్‌కు సహకరించారు. ఈ సందర్భంగా పాఠశాలలు, కార్యాలయాలు మూసి వేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు మోటారు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ సర్కిల్‌లో జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. టైర్లు కాల్చివేసి చంద్రబాబునాయుడు ద్రోహి, సిక్సిజ్టి,సిక్సిజ్టి 120 , చంద్రబాబునాయుడు 420 అంటు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు చంద్రారెడ్డి యాదవ్‌, రాజశేఖర్‌రెడ్డి, జయరామిరెడ్డి, రాజేష్‌, సురేష్‌, సురేంద్రరెడ్డి, సుబ్రమణ్యం, రమణ, ఇంతియాజ్‌ఖాన్‌, ఖాన్‌, రిజ్వి, మునిరాజ , బావాజాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags; The bandh held in protest against the attack on the police in Punganur is peaceful

Post Midle