తాళిని ఎగతాళి చేసిన బార్య…భార్య తల నరికేసిన భర్త 

The barrister ridiculed Thalini ... the wife's husband is the husband's husband

The barrister ridiculed Thalini ... the wife's husband is the husband's husband

నరికేసి భార్య తలతో స్టేషన్‌కు చేరిన వైనం
Date:10/10/2018
రాయచోటి  ముచ్చట్లు:
వివాహేతర సంబంధం ఓ యువతి నిండు ప్రానాలను బలి తీసుకుంది. తాళి కట్టిన భర్తతో సంబంధాన్ని ఆమె ఎగతాళి చేసింది.. ఆయనను.. ఆయన మాటను పెడచెవిన పెట్టింది..ప్రియుడి మోజులో పడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసింది.. వివాహేతర సంబంధమే సర్వస్వంగా భావించింది.. భర్తకు ఆగ్రహం కలిగింది.. ఆయనలోని కిరాతకుడు కొడవలిపట్టాడు.. భార్యను నరికేసి తలతో స్టేషన్‌కు చేరాడు.. సంబేపల్లె మండలంలో మంగళవారం రాత్రి జరిగిన ఈ హత్య సంచలనమైంది. రాయచోటి సంబేపల్లె మండలం దుద్యాల పంచాయతీ వడ్డెపల్లెకు చెందిన పసుపులేటి వెంకటరమణ(40)కు అదే గ్రామానికి చెందిన రాణి(32)తో 18 ఏళ్ల కిందట వివాహమైంది.
కొంత కాలంగా వీరు ఇరువురు అన్యోన్యంగా జీవనం గడుపుతూ వచ్చారు. వీరికి ఇద్దరు కుమారులు కలిగారు. వీరి పోషణ భారమైన వెంకటరమణ గల్ఫ్‌కు వెళ్లి కుటుంబాన్ని పోషించుకొంటూ వచ్చారు. ఆ సమయంలోనే పొరుగునే ఉన్న బైనేని దళితవాడకు చెందిన నాగేశ్వరరావుకు రాణెమ్మ దగ్గరైంది. వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న బంధువులు ఆమెను మందలించారు. ఆ సమయంలో పుట్టింటికి వెళ్లిపోయినా పిల్లల జీవితాలు చెడిపోకూడదని నచ్చజెెప్పి తిరిగి వెంకటరమణ ఇంటికి కాపురానికి పంపారు. ఆమె మనసు మారలేదు. ఈ తరుణంలోనే ఆమె కుమారులలో ఒకరు అనుమానాస్పదంగా మృతి చెందారు. ప్రియుడి సహకారంతోనే కుమారుడిని హతమార్చిందన్న అనుమానం భర్త వెంకటరమణకు కలిగింది.
అప్పటి నుంచి కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు కొనసాగుతూ   వచ్చాయి. కువైట్‌ నుంచి తాను సంపాదించి పంపుతూ వచ్చిన డబ్బులకు జమాఖర్చులు సక్రమంగా చెప్పలేదని, చేసిన అప్పులు తీరకపోవడంపై రాణిని పలుమార్లు ప్రశ్నించినా సరైన సమాధానం లేకపోవడంతో వెంకటరమణ నెల రోజుల కిందటనే కువైట్‌ నుంచి ఇంటికి తిరిగొచ్చారు. అప్పటి నుంచి రాణి కదలికలను పసిగడుతూ వచ్చారు. మంగళవారం సాయంత్రం రాణి తన ప్రియుడు నాగేశ్వరరావుతో కలిసి ద్విచక్ర వాహనంపై గ్రామం నుంచి వెలుపలికి వెళ్తుండగా వారిని వెంబడించారు. విషయం తెలుసుకున్న వెంకటరమణ దుద్యాల చెక్‌పోస్టు వద్దకు వెళ్లి  ఆ వాహనాన్ని అడ్డుకున్నారు. ఆ సమయంలో ఆమెను దింపేసి ప్రియుడు బండిపైనే పారిపోయాడు. వెంకటరమణ ఆగ్రహంతో ఊగిపోతూ ప్రియుడితో పట్టుబడిన భార్య రాణిపై దాడి చేస్తూ పంట పొలాల్లోకి తీసుకెళ్లి గొంతు కోసి దారుణంగా హతమార్చారు.
అంతటితో ఆగక ఆమె తలను వేరుచేసి గోతాం సంచిలో పెట్టుకుని పది కిలోమీటర్ల దూరంలోని సంబేపల్లె పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసులు ఆరా తీసేలోపే సంచిలో నుంచి తలను బయటకు తీశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బంది తలను చూసి నిర్ఘాంతపోయారు. విషయం తెలుసుకున్న రాయచోటి గ్రామీణ సీఐ నరసింహరాజు, స్థానిక ఎస్సై హాసంతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక వీఆర్వోతో పాటు సంఘటనకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీశారు. వివాహేతర సంబంధం, కుటుంబంలో తలెత్తిన తగాదాలే ఈ హత్యకు దారి తీశాయని ప్రాథమిక విచారణలో తేలినట్లు ఆయన విలేకర్లకు వివరించారు. ఆయన ఘటనా స్థలి నుంచి స్టేషన్‌కు ఎలా వచ్చారు.. ఎవరైనా సహకరించారా? అనే విషయాలు విచారిస్తున్నామని వివరించారు. తల్లి మరణం, తండ్రి కటకటాల పాలు కావడంతో వారికి ఉన్న ఏకైక కుమారుడు అనాథగా మారాడని బంధువులు వాపోయారు. రాణిని కుటుంబీకులు మందలించినా పద్ధతి మార్చుకోకపోవడమే ప్రాణం మీదకు తెచ్చిందని స్థానికులు చర్చించుకొంటున్నారు.
Tags:The barrister ridiculed Thalini … the wife’s husband is the husband’s husband

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *