పొలిటికల్ హీట్ పెంచుతున్న మాటల యుద్ధం

Date:06/08/2018
విజయవాడ ముచ్చట్లు:
ఏపీలో పాత మిత్రులు మధ్య మాటల యుద్ధం పొలిటికల్ హీట్ పెంచేస్తోంది. రాష్ట్రంలో పెద్ద స్కామ్‌ జరిగిందంటూ బీజేపీ ఆరోపిస్తుంటే.. దమ్ముంటే నిరూపించాలంటూ టీడీపీ సవాల్ విసురుతోంది. కుంభకోణంతో మొదలైన ఈ పొలిటికల్ వార్.. ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా పంచ్‌లు పేల్చుకునే వరకు వెళ్లింది. అకౌంట్ల పేరుతో పెద్ద స్కాం జరిగిందంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు స్పందించారు. పీడీ అకౌంట్లంటే అర్థం తెలియని జీవీఎల్.. మిడి, మిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని విమర్శించారు కుటుంబరావు. పీడీ అకౌంట్లలో రూ.20వేల కోట్లు మురిగిపోతున్నాయని మాట్లాడం సరికాదన్నారు. రాజ్యసభ సభ్యుడైన ఆయనకు ట్రెజరీలో నిధులు నిలువ ఉండవనే విషయం తెలియకపోవడం దారుణమన్నారు. ఇక యూసీల విషయానికొస్తే.. కేంద్రంలో చాలా శాఖలు యూసీలు ఇవ్వలేదని కాగ్ చెప్పిందని.. దీనిపై జీవీఎల్ విరణ ఇవ్వగలరా అని ప్రశ్నించారు కుటుంబ రావు. ఆరోపణలు చేయడం కాదని దానికి సంబంధించిన ఆధారాలు చూపించాలన్నారు. యూపీ నుంచి ఎంపీగా ఎన్నికైన జీవీఎల్… దమ్ముంటే ఏపీలో కనీసం వార్డ్ మెంబర్‌గా గెలవాలని సవాల్ విసిరారు. కుటుంబరావు చేసిన వ్యాఖ్యలపై జీవీఎల్ కూడా స్పందించారు. కామన్వెల్త్, 2జీ స్కాంల కంటే పెద్దది ఏపీలో జరిగిన పీడీ కుంభకోణమన్నారు నరసింహారావు. రూ.53వేల కోట్లను పర్సనల్ అకౌంట్స్‌లో వేశారని.. అవి దారిమళ్లాయని ఆరోపించారు. దీనిపై సమాధానం చెప్పమంటే.. తనపై వ్యక్తిగతమైన విమర్శలు చేస్తూ తప్పించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని.. తమపై అవినీతి ఆరోపణలు లేవని చెప్పే చంద్రబాబు, లోకేష్ ఈ స్కాంపై స్పందించాలన్నారు. ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు షేర్ మార్కెట్ బ్రోకరని.. దీనిపై ఆయన సమాధానం చెప్పడమేంటని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ తెరపైకి తీసుకొచ్చిన పీడీ స్కాంపై పొలిటికల్ హీట్ అంతకంతకూ పెరుగుతోంది. జీవీఎల్ వ్యాఖ్యలకు టీడీపీ కౌంటర్లు ఇస్తుంటే.. ఆయన కూడా అదే రేంజ్‌లో సమాధానం చెబుతున్నారు. పరిస్థితి చూస్తంటే రాబోయే రోజుల్లో ఈ మాటల యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది.
Tags:The Battle of Politically Heat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *