రాజ్య సభ సభ్యునిగా ఆర్ కృష్ణయ్య ఎంపిక పట్ల బిసి మహిళా సంఘం ఘన సన్మానం

హైదరాబాద్  ముచ్చట్లు:

బిసీ ల ఆశా జ్యోతి , బీసీ  ల అభివృధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రియతమ నాయకుడు ఆర్ కృష్ణయ్య రాజ్య సభ సభ్యునిగా ఎన్నికైనండులకు బిసి మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జి.రమాదవి, వర్కింగ్ ప్రెసిడెంట్  కే,పుష్పలత ప్రదాన కార్యదర్శి కటుకురి లక్ష్మి,కన్వినర్ అడ్వకేట్  వి.ఉమాదేవి,గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు లతా సింగ్,చెన్న అనిత ,ఏ. సత్తెమ్మ, డి.రేణుక తదితరులు మంగళవారం బిసి భవన్ లో కలిసి శాలువా కప్పి పూల గుచ్చెం తో ఘనంగా సత్కరించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా రమాదవి మాట్లాడుతూ  బిసి ల పెన్నిధి, మా అన్నయ్య రాజ్యసభలో అడుగుపెట్టి బిసి ల వాదాన్ని వినిపించి దేశం లో బిసిల ఆత్మ గౌరవాన్ని వెలుగెత్తి చాటగలరన్న  ఆశాబావాన్ని ఆమె వ్యక్తం చేసారు.గత  47 సంవత్సరాలుగా బి.సి ల సంక్షేమం కోసం ఉద్యమాలు చేస్తూ… రాజ్యసభ లో బి.సి హక్కులకై పోరాడటానికి పార్లమెటులో అడుగు పెడుతున్న ఆర్.కృష్ణయ్య చట్టసబల్లో బిసి ల బిల్లు, జనగణనలో బిసి గణన, పార్లమెంట్లో మహిళా బిల్లు కై కేంద్ర ప్రభుత్వం పై వత్తిడి తేగలడన్న విశ్వాసాన్ని రమాదవి  వ్యక్తం చేసారు. అధికారుల గుండెల్లో అలుపెరుగని అగ్నివై ఉద్యమకెరటమై బిసిల గెలుపు ఇలాగే సాగీస్తూ  ముందుకు సాగాలని ఆకాంకించారు. ఈ సందర్బంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఆమె హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

 

Tags: The BC Mahila Sangham is a solid tribute to the election of R Krishnaiah as a member of the Rajya Sabha

Post Midle
Post Midle
Natyam ad