గాయాలతోనే ఎలుగుబంటి మృతి

విశాఖపట్నం ముచ్చట్లు:


శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో ప్రజలపై దాడి చేసిన ఎలుగుబంటి మృతికి గల కారణాలను విశాఖ జూ క్యూరేటర్ నందిని సలారియా వివరించారు.ఎలుగుబంటి మృతికి తీవ్రమైన గాయాలే కారణమని,ఎలుగుబంటి ప్రతి అవయవానికి తీవ్రగాయాలు ఉన్నాయన్నారు. ఎలుగుబంటి దాడి నుంచి తప్పించుకునే క్రమంలో దాడికి పాల్పడినట్లుగా కనిపించిందన్నారు. ఇతర జంతువుల దాడిలో కూడా గాయపడిందన్నారు. తమ దగ్గరకు వచ్చే సరికే ఎలుగుబంటి చనిపోయిందని.. చనిపోయిన భల్లూకాన్ని ఆడ ఎలుగుబంటిగా నిర్ధారించినట్లు నందిని సలారియా తెలిపారు. ఎలుగుబంటి మృతికి గల కారణాలను, పోస్ట్ మార్టం నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు.

 

Tags: The bear died of its injuries

Post Midle
Post Midle
Natyam ad