పాత్రలలలో ఒదిగిపోయే అందాల తార

The beauty of the beauty of the characters

The beauty of the beauty of the characters

Date:27/02/2018
ముంబై ముచ్చట్లు:
దేశంలో శ్రీదేవికి లభించిన ఆధరణ మరే హీరోయిన్‌కు లభించలేదనే చెప్పుకోవాలి. డ్యాన్స్, కామెడీ, సీరియస్, రొమాంటిక్.. ఇలా ఏ పాత్ర ఇచ్చినా అందులో పరకాయ ప్రవేశం చేసి.. ఆ పాత్రకు జీవం పోయడం శ్రీదేవి ప్రత్యేకత. అందుకే ఆమెను హీరోయిన్లలో ‘సూపర్ స్టార్’ అంటారు. శ్రీదేవి మొదటి నుంచి తన పాత్రలను ఆచీతూచీ ఎంపిక చేసుకునేది. అలాగని ఏ పాత్ర పడితే ఆ పాత్ర ఆమె ఒప్పుకునేది కాదు. ఈ క్రమంలో ఆమె హాలీవుడ్ చిత్రాన్ని కూడా వదులుకుందంటే ఆశ్చర్యం కలగక మానదు.సాధారణంగా హాలీవుడ్ చిత్రం అనగానే నేటి హీరోయిన్లు ఎగిరి గంతేస్తారు. ఏ పాత్రైనా.. కొద్దిసేపు కనబడితే చాలని అనుకుంటారు. కానీ, శ్రీదేవి అలా భావించలేదు. ఈ అతిలోక సుందరి అభినయానికి మంత్రముగ్ధుడైన స్టివెన్ స్పిల్‌బర్గ్.. ‘జురాసిక్ పార్క్’ సినిమాలో అవకాశం ఇచ్చారు. అయితే, అందులో ఆమె పాత్ర చాలా చిన్నది కావడం, అప్పటికే సూపర్ స్టార్‌గా ఉన్న తనకు ఆ పాత్ర తగినది కాదని భావించి ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించింది. 1993లో విడుదలై ‘జురాసిక్ పార్క్’ అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.ఆ సినిమా విడుదలైన రెండేళ్లలో శ్రీదేవి తల్లి రాజేశ్వరి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఆమె తల్లికి న్యూయార్క్‌లో ఆపరేషన్ చేయించింది. సినిమాలు వదిలి నిత్యం తల్లితోనే ఉండేది. అయితే, వైద్యులు రాజేశ్వరికి ట్యూమర్ ఉన్న చోట కాకుండా వేరొక వైపు ఆపరేషన్ చేశారు. దీంతో ఆమె తల్లి చూపు, జ్ఞాపకశక్తి కోల్పోయి.. 1996లో మరణించారు. అప్పట్లో ఈ కేసు అమెరికాలో సంచలనం సృష్టించింది.1993లో విడుదలైన షారుక్ ఖాన్ ‘డర్’ చిత్రాన్ని కూడా శ్రీదేవి తిరస్కరించింది. ఆ సినిమాలో ఆమె పాత్ర చాలా సాధారణంగా ఉందనే కారణంతో ఆ సినిమాను వదులుకుంది. దీంతో జుహీ చావ్లాకు అవకాశం ఇచ్చారు. అప్పట్లో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఈ సందర్భంగా శ్రీదేవి స్పందిస్తూ.. ‘‘ఆ సినిమాలోని పాత్రను ఎన్నోసార్లు చేశాను. అందుకే కొత్తగా అనిపించలేదు. షారుక్ ఖాన్ పాత్ర నాకు బాగా నచ్చింది. అది ఇచ్చి ఉంటే చేసేదాన్నే. అయితే, జుహీ కొత్తగా వచ్చింది కాబట్టి ఆమెకు ఆ పాత్రకు చాలా బాగా కుదిరింది’’ అని పేర్కొంది.దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమాను కూడా శ్రీదేవి తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే, ఆయా చిత్రాల్లో అవకాశం కోల్పోయినందుకు శ్రీదేవి ఏ రోజు కుంగిపోలేదు. ఎందుకంటే.. అప్పటికే ఆమె ఎన్నో బ్లాక్‌బాస్టర్లతో అభిమానుల మదిలో చెరగని ముద్ర వేశారు.
Tags: The beauty of the beauty of the characters

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *