అఖండ నామ సంకీర్తన ప్రారంభం
తిరుమల ముచ్చట్లు:
తిరుమలలో అఖండ నామ సంకీర్తన 2007 సంవత్సరాంలో ప్రారంభించడం జరిగింది. అఖండ నామ సంకీర్తన మొదట పల్లేటుర్లలో ఉన్న జనపద కళాకారులతో ప్రారంభించామని టిటిడి ఇఓ ధర్మా రెడ్డి అన్నారు. కరోనా సమయంలో ఈ అఖండ నామ సంకీర్తన రద్దు చేశాం. దానిని తిరిగి ఇవాళ్టి నుండి పునఃప్రారంభించాం. రెండు తెలుగు రాష్ట్రాల నుండి దాదాపు 7 వేల 500 మంది కళాకారులు, గ్రూపులుగా సంవత్సరం పోడవునా ప్రతి రోజు పాల్గొంటారు. గ్రూప్ కి 15 మంది చొప్పున మొత్తం 1 లక్షా 13 వేల మంది జానపద కళాకారులు రిజిస్టర్ అయి ఉన్నారు. ప్రతి రోజు కూడా 12 గ్రూప్లు వారు ఈ అఖండ నామ సంకీర్తన భజన కార్యక్రమంలో పాల్గొంటారు. ఒక్కోక్క గ్రూప్ 1గంట సేపు పాల్గొంటారు,అలా 24 గంటల సేపు 24 గ్రూప్లు నిరంతరం ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ గ్రూప్ జానపద కళాకారులందిరికి కూడా రవాణా చార్జీలు తోపాటు తిరుమల బస చేసేందుకు గదులు కేటాయిస్తామని అన్నారు.
Tags: The beginning of Akhanda Nama Sankirtana

