వైఎస్సార్‌ కంటి వెలుగుశిబిరం ప్రారంభం

The beginning of the YSSAR Eye Luminary

The beginning of the YSSAR Eye Luminary

Date:10/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వైఎస్సార్‌ కంటి వెలుగు విద్యార్థుల శిబిరాన్ని గురువారం పట్టణంలో మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌, ఎంపీడీవో లక్ష్మిపతినాయుడుతో కలసి మెడికల్‌ ఆఫీసర్‌ సోనియా ప్రారంభించారు. స్థానిక బసవరాజ హైస్కూల్‌లో వైద్యబృందం విద్యార్థులకు ప్రాథమిక కంటి పరీక్షలు నిర్వహించారు. అన్ని పాఠశాలల్లోను 16 వ తేదీ వరకు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సోనియా మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు ఆరు రోజుల పాటు అన్ని పాఠశాలల విద్యార్థులకు ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తామన్నారు. రెండవ విడతలో నవంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు విద్యార్థులకు అవసరమైన చికిత్సలు చేయడంతో పాటు కంటి అద్దాలను ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చికిత్సలకు తప్పకుండ పంపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు పవన్‌కుమార్‌, ఆనందరావు, పవిత్రన్‌, ప్రవీన్‌తో పాటు ఎంఈవో లీలారాణి , పట్టణ పార్టీ అధ్యక్షుడు ఇఫ్తికార్‌ , వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

వాల్మీకి జయంతిని జయప్రదం చేయండి

Tags: The beginning of the YSSAR Eye Luminary

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *