The benefits of the employment wages are the result of the efforts of Minister Peddi Reddy and MP Mithun

మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్‌ల కృషి ఫలితమే ఉపాధి కూలీలకు లబ్ధి

– ముత్యంశెట్టి విశ్వనాథ్‌

Date:28/03/2020

పుంగనూరు ముచ్చట్లు:

రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల కృషి ఫలితమే ఉపాధిహామి కూలీలకు రోజుకు రూ.202లు పంపిణీ చేయడం జరుగుతుందని ఉపాధిహామి పథకం రాష్ట్ర కౌన్సిలర్‌ ముత్యంశెట్టి విశ్వనాథ్‌ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉపాధిహామి కూలీలకు రోజుకు రూ.182 నుంచి రూ.202 లకు పెంచాలని మంత్రి పెద్దిరెడ్డి సూచనల మేరకు ఎంపీ మిధున్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో చర్చించడం జరిగిందన్నారు. ఈ చర్చల ఫలితమే ఉపాధి కూలీలకు రోజుకు రూ.202లు ఇవ్వడం జరుగుతుందన్నారు. దీని కారణంగా దేశవ్యాప్తంగా ఐదుకోట్ల మంది ఉపాధి కూలీలకు చేయూతలభించిందన్నారు. కరోనా వైరస్‌ కారణంగా ఉపాధిలేని కూలీలకు ప్రణాళిక బద్ధంగా ఆదుకుంటామని హామి ఇచ్చారు. ఈ మేరకు మంత్రి పెద్దిరెడ్డి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఉపాధి కూలీలందరిని ఆదుకుంటామని , ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు.

కరోనా నివారణ చర్యలపై న్యాయమూర్తి ఆరా

Tags: The benefits of the employment wages are the result of the efforts of Minister Peddi Reddy and MP Mithun

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *