Natyam ad

తగ్గేదేలే అంటున్న పందెం రాయుళ్లు

విజయవాడ ముచ్చట్లు:
 
సంక్రాంతి వచ్చిందంటే ఉభయ గోదావరి జిల్లాల్లో కోళ్లు కాళ్లు దువ్వుతాయ్. ఇది కొందరికి సంప్రదాయం. మరికొందరికి పండుగ పూట వినోదం.. ఇంకొందరికి దండిగా ఆదాయం సమకూరే మార్గం. ఆనవాయితీ ముసుగులో ఇదే వేదికగా ఇతర జూదాలకు దిగుతున్నారు.ఏటా సంక్రాంతికి కోట్లలో చేతులు మారుతుండడం రివాజుగా మారుతోంది. అడ్డుకుంటామని పోలీసులు అంటుంటే..ఆడించి తీరుతామని నిర్వాహకులు తేల్చి చెబుతున్నారు. సవాళ్లు..ప్రతి సవాళ్ల మధ్య రెండు జిల్లాల్లో సంక్రాంతి కోడి పందాలపై ఉత్కంఠ నెలకొంది.తెలుగు లోగిళ్లలో పెద్ద పండగ సంక్రాంతి. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో సంబరాలు మొదలయ్యాయి. మూడు రోజులు ఘనంగా జరుపుకునే ఈ పండగ సంస్కృతి, సంప్రదాయాలకు నెలవు. సంక్రాంతి రోజుల్లో గోదావరి జిల్లాల్లో కోడి పందాలు జోరుగా సాగుతుంటాయి. పందెంరాయుళ్లు కోళ్లకు కత్తులు కట్టి బరిలో దింపడానికి ఇప్పటికే రెడీ అయిపోయారు.సర్కారు హెచ్చరిస్తున్నా..న్యాయస్థానాలు వద్దని వారిస్తున్నా..పోలీసులు కేసులు పెడుతున్నా..పెడచెవిన పెడుతున్నారు పందెంరాయుళ్లు. ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలకు బరులు సిద్ధం అయ్యాయి. రెండు జిల్లాల్లో సంక్రాంతికి బెట్టింగ్ బంగార్రాజులు కోళ్లతో రెడీ అయిపోయారు. రెండు జిల్లాల పోలీసులు మాత్రం పందెంరాయుళ్లపై కన్నెర్రజేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కోడి పందాలను జరగనివ్వబోమని వార్నింగ్‌ ఇస్తున్నారు.
 
 
పోలీసులు.ఖాళీ స్థల్లాల్లో కోళ్లను పందాలకు సిద్ధం చేస్తున్నారు నిర్వాహకులు. కోనసీమలోని ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన, వల్లంకుర్రు మండలాల్లో సంప్రదాయం ముసుగులో కోడి పందాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దాపురం, కాకినాడ రూరల్, పిఠాపురం, కిర్లంపూడి, మల్లిశాల, జగ్గంపేట ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తుంటారు. మరోవైపు పండగలకు ఇతర జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి చుట్టాలు, స్నేహితుల పేరుతో జిల్లాకు వచ్చిన వారు ముందస్తుగా లాడ్జిల్లో రూమ్‌లు బుక్ చేసుకుంటున్నారు.ఏళ్ల తరబడి నాలుగు రోజుల పాటు కోడిపందాలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. బరుల నిర్వాహకులు కొందరు చిన్నా..పెద్దా నాయకులను కలిసి అనుమతికి ఒప్పించాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. బరుల నిర్వహణపై చూసీచూడనట్లు వదిలేయాలనే ఒత్తిడి పెరిగింది.
 
 
 
రాజకీయాలకు అతీతంగా ఒక్కటై కోడిపందేలకు సై అంటున్నారు. కొందరు స్థానిక అధికారులను మచ్చిక చేసుకుంటున్నారు. మరికొందరిని ఒత్తిళ్లతో బెదరగొడుతూ బరుల జోలికి రాకుండా చక్రం తిప్పుతున్నారు.పందాల కోసం జిల్లాలకు కోట్లాది రూపాయలు చేరినట్టు తెలుస్తోంది. కోడి పందాలకు ముందు లక్షలాది రూపాయలు ప్రచారం పేరుతో పోలీసులు ఖర్చు చేయడం షరా మామూలుగానే మారుతోంది. పోలీసుల ఆంక్షలు..పందెంరాయుళ్లు పట్టువీడకపోతుండటంతో రెండు జిల్లాల్లోనూ ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.కోడి పందాల స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రెండు జిల్లాల్లోనూ బరులను ఎక్కడికక్కడే ధ్వంసం చేస్తున్నారు. చట్ట వ్యతిరేక పనులను ఉపేక్షించబోమని తేల్చి చెబుతున్నారు ఖాకీలు. పోలీసులు ఎన్ని రకాల ఆంక్షలు విధించినా…తగ్గేదే లే అంటున్నారు పందెం రాయుళ్లు. నిర్వాహకులు కూడా గుట్టు చప్పుడు కాకుండా పందాలకు రెడీ అయిపోతున్నారు
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: The bet is that the royals are falling