బిల్లు భారత రాజ్యంగంపై దాడి

Date:10/12/2019

న్యూఢిల్లీ ముచ్చట్లు:

పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ బిల్లు(క్యాబ్‌)ను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్య‌తిరేకించారు. ఆ బిల్లు.. భార‌త రాజ్యాంగంపై దాడి అని ఆయ‌న విమ‌ర్శించారు. ఇవాళ ట్విట్ట‌ర్‌లో రాహుల్ స్పందించారు. ఆ బిల్లుకు మ‌ద్ద‌తు ఇచ్చేవాళ్లు.. మ‌న దేశ వ్య‌వ‌స్థీకృత విధానంపై దాడి చేస్తున్న‌ట్లే అన్న అభిప్రాయాన్ని రాహుల్ వినిపించారు. పౌర‌స‌త్వ బిల్లుకు శివ‌సేన పార్టీ మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ప‌ట్ల రాహుల్ కొంత విస్మ‌యాన్ని వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల మ‌హారాష్ట్ర‌లో కాంగ్రెస్, శివ‌సేన‌, ఎన్సీపీ పార్టీలు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. దేశ ప్ర‌యోజ‌నాల దృష్ట్యా పౌర‌స‌త్వ బిల్లుకు ఓకే చెప్పిన‌ట్లు శివ‌సేన పేర్కొన్న‌ది. కానీ రాహుల్ మాత్రం ఆ నిర్ణ‌యాన్ని స్వాగ‌తించ‌డం లేదు. సోమ‌వారం లోక్‌స‌భ‌లో పౌర‌స‌త్వ బిల్లు 311 ఓట్ల‌తో ఆమోదం పొందింది.

 

అమెరికాకు  షా స్ట్రాంగ్ కౌంటర్

 

Tags:The bill is an attack on the Indian constitution

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *