బీజేపీకి లోక్ సభ ఎన్నికల్లో చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం

Date:12/01/2019
లక్నో ముచ్చట్లు:
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీకి రాబోయే లోక్ సభ ఎన్నికల్లో చెక్ పెట్టేందుకు రంగం సిద్ధమయింది. 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఉత్తరప్రదేశ్ లో ఉప్పు-నిప్పుగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) జట్టుకట్టాయి. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 80 స్థానాలకు గానూ చెరో 38 చోట్ల పోటీ చేయాలని నిర్ణయించాయి. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోనప్పటికీ అమేథీ(రాహుల్ గాంధీ), రాయ్ బరేలీ(సోనియా గాంధీ) స్థానాల్లో పోటీ చేయబోమని స్పష్టం చేశాయి. మిగిలిన రెండు స్థానాలను మిత్రపక్షాలకు కేటాయిస్తామని పేర్కొన్నాయి. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ చీఫ్ మాయావతి యూపీ రాజధాని లక్నోలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వివరాలను ప్రకటించారు. యూపీలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలుండగా బీఎస్పీ 38 స్థానాల్లో, ఎస్పీ 38 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
మిగతా నాలుగు సీట్లను ఇతర పార్టీలకు వదిలినట్లు ఆమె తెలిపారు. అమేథి, రాయ్‌బరేలి స్థానాలను కాంగ్రెస్‌ కోసం విడిచిపెట్టినట్లు చెప్పారు.‘దేశ ప్రజల ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకుంటున్నాం. ఈ పొత్తు రెండు పార్టీల ప్రయోజనాల కోసం కాదు. భాజపాకు సమాధానం చెప్పేందుకు ఇదొక చారిత్రక సమావేశం. కోట్లాదిమంది ప్రజలు కేంద్రంలోని భాజపాపై అసంతృప్తిగా ఉన్నారు. రైతులు, నిరుద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. సమాజంలోని కోట్ల మందిని కాపాడేందుకే ఈ పొత్తు.సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో పట్టు సాధించేందుకు సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. పొత్తు, సీట్ల పంపకాల గురించి ప్రకటన చేశారు. మాయావతి మాట్లాడుతూ.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇది దేశ రాజకీయాల్లో సరికొత్త విప్లవానికి దారి తీస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
 1993లో బీఎస్పీ చీఫ్‌ కాన్షీరామ్‌, ములాయం సింగ్‌ యాదవ్‌ కలిసి యూపీ ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఇప్పుడు మేం కూడా అదే స్ఫూర్తితో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. ఎస్పీ-బీఎస్పీ పొత్తు పేదలు, కార్మికులు, యువత, మహిళలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనార్టీల కోసమే’ అని మాయవతి స్పష్టం చేశారు.‘గతంలో కాంగ్రెస్‌ బోఫోర్స్‌ కుంభకోణం వల్ల అధికారాన్ని కోల్పోతే.. ప్రస్తుతం భాజపా రఫేల్‌ వల్ల అధికారాన్ని కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంది. ఒకప్పుడు కాంగ్రెస్‌ హయాంలో అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తే.. ప్రస్తుతం బీజేపీ పాలనలో అధికారికంగా ప్రకటించకపోయినా అటువంటి పరిస్థితులే నెలకొన్నాయి’ అని ఆమె దుయ్యబట్టారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకపోవడానికి గల కారణాలను మాయావతి వివరించారుఈ కూటమితో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిద్రలేని రాత్రులు గడపబోతున్నారు. కాంగ్రెస్ విధానాల కారణంగానే మాలాంటి పార్టీలు ఉనికిలోకి వచ్చాయి. కాంగ్రెస్ లేదా బీజేపీ.. ఎవరు అధికారంలోకి వచ్చినా తేడా ఏమీ లేదు.
కాంగ్రెస్ తో జతకట్టడం వల్ల మాకు పెద్దగా ప్రయోజనం లేదు. కేవలం ఎన్నికల్లో గెలిచేందుకే మేం ఈ పొత్తు పెట్టుకోలేదు. దేశంలోని సామాన్యులు, దళితులు, మైనారిటీల హక్కులను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. దేశ ప్రయోజనాల కోసం విభేదాలను, గెస్ట్ హౌస్ గొడవను పక్కనపెట్టి మేం చేతులు కలపాలని నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు.అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ..‘మాయావతి గారిని అవమానిస్తే.. నన్ను వ్యక్తిగతంగా అవమానించినట్లే’ అని సమాజ్ వాదీ కార్యకర్తలను పరోక్షంగా హెచ్చరించారు. దాదాపు 25 ఏళ్ల  క్రితం లక్నోలోని ఓ గెస్ట్ హౌస్ లో మాయావతిపై సమాజ్ వాదీ కార్యకర్తలు దాడిచేశారు. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుని మాయావతి తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. గతేడాది యూపీలోని గోరఖ్ పూర్ సహా మూడు లోక్ సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ ఉమ్మడి అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. ఈ నేపథ్యంలో విపక్ష కూటమి అనే ఆలోచన మొగ్గతొడిగింది.
రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం సమాజ్‌ వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) కుదుర్చుకున్న పొత్తుపై ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ, అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలోని ఎస్పీ తమ ఉనికి కోసమే ఏకమయ్యాయని ఆరోపించారు. ప్రజలకు ఈ పార్టీల గురించి బాగా తెలుసునని, తగిన విధంగా ఓట్లు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు.(ఎస్పీ- బీఎస్పీ పొత్తు ఖరారు)‘తమ ఉనికిని కాపాడుకోవడానికే ఈ ప్రయత్నం.
అంతకన్నా మరేమీ లేదు. వారి పొత్తు మాకే(బీజేపీ) లాభాన్ని చేకూరుస్తుంది. ప్రజలకు తెలుసు అసలు నిజాలేమిటో, అందుకు అనుగుణంగా ఓట్లు వేస్తారు. బీజేపీ 2014లో సాధించిన స్థానాలక కన్నా ఎక్కువ స్థానాలను 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలుస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.ఉత్తర ప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమికి 73 స్థానాలు లభించాయి. 2019ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీలు కలిసి బరిలోకి దిగనున్నాయి. ఇరుపార్టీలు చెరో 38 స్థానాల్లో, ఆర్‌ఎల్డీ రెండు స్థానాల్లో పోటీకి దిగనున్నాయి
Tags:The BJP is preparing to check the Lok Sabha elections

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *