తెలంగాణ‌లో బిజెపి అధికారంలోకి రావ‌డం ఖాయం 

–   బిజెపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అరుణ్‌సింగ్
Date:16/03/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
సంస్థాగ‌తంగా ఎలాంటి బ‌లం లేని త్రిపుర లాంటి రాష్ట్రాల్లో బిజెపి అధికారంలోకి వ‌చ్చింద‌ని, 2014 త‌ర్వాత దేశంలో 14 రాష్ట్రాల్లో క‌మ‌లం పార్టీ అధికారం చేప‌ట్టింద‌ని, 2019లో తెలంగాణ‌లో కూడా బిజెపి అధికారంలోకి వ‌స్తుంద‌ని బిజెపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అరుణ్‌సింగ్ ఆశాభావం వ్య‌క్తం చేశారు.రాష్ట్రంలో రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న పార్టీ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన బిజెపి రాష్ట్ర పదాధికారుల, ఓబీసీ మోర్చా, మీడియా క‌మిటీ, ఐటీ, సోష‌ల్ మీడియా స‌మావేశాల్లో మాట్లాడారు.క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో బిజెపి ఘ‌న విజ‌యం సాధిస్తుంద‌ని, అధికారాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని..దాని త‌ర్వాత ద‌క్షిణాది రాష్ట్రాల్లో పెనుమార్పులు సంభ‌విస్తాయ‌ని,అవి బిజెపికి అనుకూలంగా ఉంటాయ‌న్నారు. టిడిపి, ఎన్డీయే నుంచి వెళ్లిపోయినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేద‌ని, దాని ప్ర‌భావం ఏమీ ఉండ‌ద‌ని.. ఇది బిజెపికి అనుకూలంగా మారుతుంద‌ని అన్నారు.రాష్ట్రంలో బూతు స్థాయి నుంచి పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి కొన్ని సూచ‌న‌లు చేశారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ అనేక సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టార‌ని, ప్ర‌జ‌లు దాన్ని గ‌మ‌నిస్తున్నార‌ని..మోదీ వ‌ల్లే దేశం అభివృద్ధి చెందుతుంద‌న్న న‌మ్మ‌కం దేశ ప్ర‌జ‌ల్లో బ‌లంగా ఉంద‌న్నారు.రేపు ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లాల్లో బూతుస్థాయి, మండ‌ల స్థాయి, జిల్లా స్థాయి కార్య‌వ‌ర్గ స‌మావేశాల్లో అరుణ్‌సింగ్ పాల్గొంటారు. ఈ కార్య‌క్ర‌మంలో బిజెపి రాష్ట్ర అధ్య‌క్షులు డాక్ట‌ర్ కె ల‌క్ష్మ‌న్‌, బిజెపి శాస‌న‌స‌భా ప‌క్ష‌నేత జి కిష‌న్‌రెడ్డి, ఎమ్మెల్యే సీహెచ్ రాంచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఎన్ రాంచంద‌ర్‌రావు, మాజీ ఎమ్మెల్యే బ‌ద్ధం బాల్‌రెడ్డి, రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు చింతా సాంబ‌మూర్తి, ప్రేమేంద‌ర్‌రెడ్డి, జి. మ‌నోహ‌ర్‌రెడ్డి, మంత్రి శ్రీ‌నివాస్ పాల్గొన్నారు.
Tags: The BJP may come to power in Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *