The BJP party needs to be strengthened

 బీజేపీ పార్టీ ని బలోపేతం చేయాలి

 

Date:03/12/2020

జిల్లా అధ్యక్షులు వెరబేల్లి రఘునాథ్

బెల్లంపల్లి ముచ్చట్లు:

తాండూరు మండలం బీజేపీ అధ్యక్షులు రామగౌని మహీధర్ గౌడ్ ఆధ్వర్యంలో  మండల స్థాయి సమావేశానికి జిల్లా అధ్యక్షుడు ముఖ్య అధితిగా హాజరయ్యారు.బీజేపీ  పార్టీ రాబోయే రోజుల్లో తెలంగాణలో  అధికారంలోకి రాబోతుందని ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పని చేయాలని బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు దేశంలో బిజెపి అధికారంలో ఉందని 20 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయని 303 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు,  ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ బిజెపి పార్టీ అన్నారు తాండూర్ మండలంలో ఉన్న  సమస్యలపై బిజెపి పార్టీ నిరంతరం పోరాడుతుందని   జాతీయ రహదారి సమస్యల   ససమస్యల పరిష్కారం కై  ఉన్నత అధికారులకు కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా తాండూరు మండలం రేచిని కి కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు  టిఆర్ఎస్వి మాజీ మండల అధ్యక్షుడు తాల్లపల్లి భాస్కర్ గౌడ్,  సతీష్ రావు ఆనంద్ లు బీజేపీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు రామగౌని మహిధర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ముని మంద రమేష్,జిల్లా ఉపాధ్యక్షులు పల్గం.తిరుపతి, బెల్లంపల్లి అసెంబ్లీ నాయకులు చిలుముల శ్రీకృష్ణదేవరాయలు, సీనియర్ నాయకులు శేషగిరి, విజయ్, మండల ప్రధాన కార్యదర్శి భరత్ మండల ఉపాధ్యక్షులు శ్రీనివాస్ శ్రీకాంత్ అజయ్ కిసాన్మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు సుధీర్ గౌడ్ బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కృష్ణ, జిల్లా కార్యదర్శి ప్రదీప్ మండల అధ్యక్షులు రాహుల్ ప్రధాన కార్యదర్శి వినోద్ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు నవీన్ నాయకులు రాకేష్ మరియు నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

డాక్టరేట్ అందుకున్న కాకతీయ  విశ్వ విద్యాలయం  వృక్ష పరిశోధకురాలు అయిందాల బాగ్య

Tags:The BJP party needs to be strengthened

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *