Natyam ad

బోటు బోల్తా..ఇద్దరు గల్లంతు

ఆచంట ముచ్చట్లు:


పశ్చిమ గోదావరి  జిల్లా ఆచంట మండలం భీమలాపురం వశిష్ట గోదావరి లో పడవ బోటు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతు అయిన వారిలో  వల్లూరు గ్రామానికి చెందిన కుడిపుడి పెద్దిరాజు ( 58) ) దొడ్డిపట్ల గ్రామానికి చెందిన సిరగం వెంకటరమణ (35). మిగిలిన ముగ్గురు సురక్షితం గా బయటపడ్డారు. కొబ్బరికాయల లోడు అధిక బరువుతో పడవ వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. ప్రమాదాన్ని గమనించి స్థానికులు, అధికారులు  వెంటనే ఘటనాస్థలికి చేరుకుని  గాలింపు చర్యలు చేపట్టారు. సామర్థ్యానికి మించి పడవలో అధిక బరువు ఎక్కించడమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది.

 

Tags: The boat overturned..both lost

Post Midle
Post Midle