పుస్తకం మనిషిని విజ్ఞానం వైపు నడిపిస్తుంది

గ్రంధాలయాలు విజ్ఞాన భాండారాలు

జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్పర్సన్ సువ్వారి సువర్ణ

 

శ్రీకాకుళం ముచ్చట్లు:

Post Midle

మంచి పుస్తకం చదవడం వలన మంచి భావనలు మనసులో పెరుగుతాయని జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్పర్సన్ సువ్వారి సువర్ణ అన్నారు.ఆమదాలవలస నియోజకవర్గం ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామంలో పుస్తక నిక్షిప్త కేంద్రం ప్రారంభించిన జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్పర్సన్ సువ్వారి సువర్ణ. కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్పర్సన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో గ్రంధాలయలు ఏర్పాటు చేసి గ్రంధాలయలు ప్రజలుకు మరింత అందుబాటులో తీసుకొని రావడo జరుగుతుందనీ, విద్యార్థులు, యువత, నిరుద్యోగులు అందరు గ్రంధాలయంను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని, గ్రంధాలయాల ద్వారా మేదోశక్తిని పెంపొదించు కోవచ్చన్నారు.ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ నాయకులు సువ్వారి సత్యనారాయణ (ఢిల్లీ ) సర్పంచ్ ప్రతినిధి సనపల ఢిల్లేశ్వర రావు ఎంపీటీసీ అన్నెపు భాస్కరరావు, పేడాడ వైకుంఠరావు, సువ్వారి అనిల్, గ్రంధాలయం కార్యదర్శి కుమార్ రాజా, అన్నాజీ, బిల్డింగ్ దాత సీపాన దంతేశ్వేరరావు, నాయుడు, నేతాజీ, విద్యార్థిని విద్యార్థులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

 

Tags:The book leads man towards knowledge

Post Midle
Natyam ad