పుస్తకం ప్రపంచ విజ్ఞానాన్ని అందిస్తుంది

– మంత్రి నిరంజన్ రెడ్డి

Date:14/11/2019

వనపర్తి ముచ్చట్లు:

పుస్తకం ప్రపంచ జ్ఞానాన్ని అందిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.  గురువారం ఆయన వనపర్తి జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంధాలయం లో 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని అన్నారు. పుస్తకాల ద్వారా తెలియని ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చని మంత్రి చెప్పారు. టీవీలు, సినిమాలు లేక పూర్వం పుస్తకాలు ఎంతో జ్ఞానాన్ని అందించాయని తెలిపారు. దేశ స్వతంత్ర సాధనలో గ్రంథాలయాల పాత్ర మరువలేనిదని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు బీ. లక్ష్మయ్య, పరిషత్ చైర్మన్ నాథ్ రెడ్డి ఆర్. డి ఓ కే . చంద్రారెడ్డి, బీచ్ పల్లి యాదవ్, తదితరులు ఉన్నారు.

 

నాలుగు లక్షలకే ఆమ్రపాలికీ స్థలం

 

Tags:The book presents global knowledge

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *