The boy commits suicide for not doing pubji

పబ్జీ ఆడొద్దన్నందుకు బాలుడు ఆత్మహత్య

Date:13/07/2020

పలమనేరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పబ్జీ గేమ్ ఆడవద్దని తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన కొడుకు ఉరేసుకున్న సంఘటన ఆదివారం పలమనేరులో చోటు చేసుకుంది.పలమనేరు సీఐ శ్రీధర్ కథనం మేరకు. పలమనేరు శ్రీనగర్ కాలనీకి చెందిన ప్రకాష్ కుమారుడు శ్యామ్ శ్రీధర్ స్థానిక ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. కరోనా కారణంగా స్కూల్ తెరవకపోవడంతో ఇంట్లో స్మార్ట్ఫోన్లో నిత్యం పబ్జి తదితర గేమ్స్ ఆడుతుండడం తో తల్లి మందలించింది. దీంతో శ్యామ్ శ్రీధర్ ఇంట్లోని ఒక గది లోకి వెళ్లి తల్లి చున్నీతో ఫ్యాన్ కొక్కికి ఉరి వేసుకున్నాడు.బిడ్డ కనిపించకపోవడంతో గదిలో చూడగా ఉరేసుకుని వేలాడుతున్న బిడ్డను చూసి వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెల్లారు,పరిస్థితి విషమంగా ఉండడంతో బాలున్ని చిత్తూరు ఆసుపత్రికి ఇక్కడి వైద్యులు రెఫర్ చేశారు,అక్కడ చికిత్సపొం దుతూ బాలుడు మృతి చెందాడు, పలమనేరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మద్యం తరలిస్తున్న ఇద్దరుఅరెస్ట్, రెండు ద్విచక్ర వాహనాల సీజ్

Tags:The boy commits suicide for not doing pubji

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *