Natyam ad

అక్రమ సంబంధానికి అడ్డు వ వస్తున్నాడని బాలుడి హత్య

-కొట్టడంతోనే బాలుడు మృతి..

-హత్య కేసులో నిందితులను అరెస్టు చేసిన తాలూకా పోలీసులు

 

మదనపల్లె ముచ్చట్లు:

Post Midle

అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని బాలుని కొట్టడంతోనే హారన్ సాకేత్ (4) మృతి చెందినట్లు తాలూకా సీఐ ఎన్. శేఖర్ మీడియాకు తెలిపారు. మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం సీఐ శేఖర్ బాలుడి హత్య కేసులో నిందితుల అరెస్టు వివరాలను బుధవారం వెల్లడించారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ… పోస్టు మార్టం నివేదికలో బాలుడు హత్యకు గురై య్యాడని వచ్చిన ఆధారాలతో కేసును లోతుగా దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. మృతుని తల్లి మయూరి ఇచ్చిన ఫిర్యాదుతో మొదట అనుమానస్పద మృతి కేసు నమోదు చేశామని చెప్పారు. కేసును తప్పుతావ పట్టిస్తూ ఆమె బాలుడు హత్యకు గురైన విషయాన్ని నీళ్లలో పడి చనిపోయాడని నేరాన్ని తార్మాలు చేసిందన్నారు. దర్యాప్తులో ఆమె ప్రియుడు కల్లూరుకు చెందిన శివశంకర్ రెడ్డితో పాటు, అక్రమ సంబంధం పెట్టుకున్న మయూరిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చి అరెస్టు చేశామని తెలిపారు. కల్లూరుకు చెందిన మయూరి, నాగరాజు దంపతులు కుమారుడు హారన్ సాకేత్(4) తల్లి మయూరి భర్తను వదిలేసి అదే ప్రాంతానికి చెందిన బ్రాందీ షాపులో పనిచేసే శివశంకర్ రెడ్డితో మదనపల్లికి వచ్చేసిందన్నారు. చిప్పిలిలో అద్దెకు ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. చిన్న బాలుడు కావడంతో హారన్ సాకేత్ ను ఇంటి దగ్గర వదిలేసి ఈ నెల 13న మయూరి విధులకు వెళ్లడంతో ఇంటి వద్ద ఉన్న ఆమె ప్రియుడు శివశంకర్ రెడ్డి బాలున్ని కొట్టి చంపేసినట్లు సీఐ తెలిపారు. మయూరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న కల్లూరు శివశంకర్ రెడ్డి తన అక్రమ సంభందంకు అడ్డుగా బాలుడు వున్నాడని ఈ హత్య చేసినట్లు సీఐ శేఖర్ తెలిపారు. అయితే బాలుడ్ని కొట్టి చంపి, నిటి సంపులో పడేసి డ్రామా ఆడారని దర్యాప్తులో తేలినట్లు తెలిపారు.

 

Tags:The boy was killed because he was getting in the way of an illicit relationship

Post Midle