బీహార్ ముచ్చట్లు:
బీహార్‌లో ఆన్‌లైన్ గేమ్స్ ఆడుకోనివ్వడం లేదని తాళం చెవులు, నెయిల్‌కట్టర్లు, కత్తిని మింగిన బాలుడు బీహార్‌లోని మోతిహారిలో తల్లిదండ్రులు ఆన్‌లైన్ మొబైల్ గేమ్స్ ఆడుకోనివ్వడం లేదని ఓ బాలుడు తాళం చెవులు, నెయిల్ కట్టర్లు, కత్తిని మింగేశాడు. అయితే కొంతకాలం సదరు బాలుడు బాగానే ఉన్నాడని, ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు బాలుడి కుటుంబ సభ్యులు తెలిపారు. బాలుడికి గంటకుపైగా శస్త్రచికిత్స చేసి అతడి కడుపులోని వస్తువులను వైద్యులు తొలగించారు.
Tags;The boy who swallowed the lock ears, nail cutters and knife