The Brahmotsavas of Sri Govindarajaswamyavas ended with the wheel

చక్రస్నానంతో ముగిసిన  శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు

Date:05/06/2020

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి.ముందుగా ఆలయంలోని మండపంలో అర్చకులు శ్రీదేవి, భూదేవి సమెత శ్రీ గోవిందరాజ స్వామివారి ఉత్సవమూర్తులతో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ కు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆ తర్వాత అక్కడి మండపంలో గంగాళంలో నీటిని నింపి వేదమంత్రాల నడుమ సుదర్శనచక్రానికి స్నానం చేయించారు.  ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మీ, ఏఈవో ర‌వికుమార్‌‌ రెడ్డి, ప్ర‌ధాన అర్చ‌కులు మ‌రియు కంక‌ణ భ‌ట్టార్ ఏ.పి.శ్రీ‌నివాస‌దీక్షితులు పాల్గొన్నారు.

గ్రామ సచివాలయాలలోనే సేవలు

Tags: The Brahmotsavas of Sri Govindarajaswamyavas ended with the wheel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *