Natyam ad

విషం తాగి నవవధువు ఆత్మహత్యాయత్నం

పుంగనూరు ముచ్చట్లు:

 

విషం తాగి నవ వధువు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన పుంగనూరు మండలంలో ఆదివారం రాత్రి జరిగింది. బాధితురాలికుటుంబీకుల కథనం మేరకు.. మండలంలోని ఆరడుగుంట పంచాయతీ, కొండచర్ల కురప్పల్లికి
చెందిన సుమిత్ర(19)ని తల్లి దండ్రులు రామసముద్రంలోని
చిన్నరెడ్డప్పకు ఇచ్చి ఐదు నెలల క్రితం పెళ్లి చేశారు. ఇటీవల పుట్టి నిల్లు అయిన కొండచర్ల కురప్పల్లికి వచ్చేసింది. కుటుంబ సమస్యల కారణంగా సుమిత్ర పుట్టినింటికి వచ్చింది. కుటుంబ సమస్యల కారణంగా ఇంట్లోనే విషం తాగిఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో గమనించిన తల్లి దండ్రులు సుమిత్రను వెంటనే 108లో మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించగా, పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించారు. అయినా ఆమె ఆరోగ్యం కుదుటపడకపోవడంతో పరిస్థితి విషమంగా మారింది. ఆమెను తిరుపతి రుయాకు తరలించాలని డాక్టర్లు సూచించారు.

 

Tags:The bride attempted suicide after drinking poison

Post Midle
Post Midle