నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నాడని పెళ్లి ఆపేసింది

లక్నో ముచ్చట్లు :

 

 

ఇరు కుటుంబాల పెద్దల తో పెళ్ళి మండపం సందడిగా ఉంది. మరి కాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలో పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి ఒక పరీక్ష పెట్టింది. అందులో అతను ఫెయిల్ కావడంతో పెళ్లి ఆపేసింది. దీంతో బంధువులు, కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ఓవరయ ప్రాంతంలో చోటుచేసుకుంది. మహారాజ్ పూర్ గ్రామానికి చెందిన వినోద్ కుమార్ కు అదే ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయం అయింది. పెళ్లి వేడుకలో అబ్బాయి నల్ల కళ్లద్దాలు పెట్టుకొని ఉండడంతో అమ్మాయి తరపు వారికి అనుమానం వచ్చింది. అబ్బాయి తరపు బంధువులను ఆరా తీస్తే సరైన సమాధానం చెప్పలేదు. దీంతో పెళ్లి కూతురు అబ్బాయిని కళ్లద్దాలు తీసి న్యూస్ పేపర్ చడవమంది. అబ్బాయి తెళ్ళముఖం వేయడంతో అతనికి కళ్ళు కనబడవు అని తెలిసింది. దీంతో పెళ్లి రద్దు చేశారు.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags: The bride stopped wearing black glasses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *