Date:10/06/2019
ఒంగోలు ముచ్చట్లు:
ప్రకాశం జిల్లాను అన్నిరంగాల్లో మరింత ప్రకాశం వంతముగా తీర్చిదిద్దుతామని నూతన జిల్లా కలెక్టర్ శ్రీపొలా భాస్కర్ వెల్లడించారు. ఆదివారం స్థానిక ప్రకాశం భవనం లోని ఆయన ఛాంబర్ లో
నూతన కలెక్టర్ పి.భాస్కర్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా తో మాట్లాడుతూ జిల్లాలో అందరి సహకారం తో జిల్లాను మరింత గా అభివృద్ధి చేపడతా మన్నారు.
జిల్లాలో దశా దిశా కార్యక్రమం క్రింద త్రాగునీరు, సాగునీరు,విద్యా,వైద్యం, ఆహారభద్రత, యువత కు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడానికి
ప్రణాళికలు తయారు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు పెంపకం పచ్చదనం, ఏర్పాట్లు చేస్తామని ఆయన చెప్పారు. జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి
గృహాలను నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు.పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రజలందరికీ ఆహారభద్రత కల్పిస్తామని ఆయన చెప్పారు. జిల్లాలో యువత కు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆయన
చెప్పారు. జిల్లాలో రవాణా సౌకర్యాలు మెరుగు పరచడానికి రోడ్డులను అనుసంధానం చేపడతామని ఆయన అన్నారు. జిల్లాలో త్రాగునీటి కి సాగునీటి కి అత్యధిక ప్రాతినిధ్యత ఇస్తామని ఆయన
తెలిపారు.జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.జిల్లాలో ప్రాధాన్యత పరంగా పనిచేస్తూ జిల్లా కు ప్రత్యేక గుర్తింపు
తీసుకువస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు నవ రత్నాలు కార్యాక్రమాన్ని సమర్ద్రవంతము గా అమలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ గా ప్రకాశము
జిల్లా కు నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్2 ఏ.సిరి,ట్రైనీ కలెక్టర్
ధనుజయ్,జిల్లా రెవెన్యూ అధికారి వెంకట సుబ్బయ్య, ఎస్.డి.సి చంద్రమౌళి, సి.పిఓ వెంకటేశ్వర్లు, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ నరసింహాలు, డ్వామా పి.డి వెంకటేశ్వర్లు, డి.ఇ.ఓ సుబ్బారావు, సర్వశిక్ష
అభ్యన్, పి.ఓ వెంకటేశ్వర రావు,మెప్మా పి.డి సింగయ్య, సాంఘీక సంక్షేమ శాఖ డి.డి లక్ష్మిసుధ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఇ. డి.లక్ష్మీ దుర్గా,జిల్లా పౌర సరఫరాల శాఖ
వెంకటేశ్వర్లు,డి.ఎం.శివపార్వతి
నాధ్ కుమార్,విద్యుత్ శాఖ ఎస్.ఇ సుబ్బరాజు, తదితరులు మర్యాద పూర్వకంగా కలిశారు.
ఘనంగా నందమూరి బాలకృష్ణ 59 వ జన్మదిన వేడుకలు
Tags:The brilliant brilliance district is the new collector Pola Bhaskar