ఉచిత చేప పిల్లల పధకంలో దళారి వ్యవస్థను రద్దు చేయాలి

– టీఆర్ఎమ్మెస్ గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు  నిర్మల ముదిరాజ్ డిమాండ్

 

హైదరాబాద్ ముచ్చట్లు:

 

 

ఉచిత చేప పిల్లల పధకంలో దళారి వ్యవస్థను రద్దు చేయాలని,సబ్సిడీ కింద ఇస్తున్న మత్స్య వాహనాలలో ఆవినీతిని అరికట్టాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర మత్స్యకారుల సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు  నందిమల్ల నిర్మల ముదిరాజ్ మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరామ్ భూక్యా ని కలిసి వినతి పత్రం సమర్పించారు.అనంతరం నిర్మల ముదిరాజ్ మీడియాతో మాట్లాడుతూ మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకనబోయినన రమణ ముదిరాజ్ ఆదేశాల మేరకు ఈరోజు మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరామ్ భూక్యా ని కలిసి రాష్ట్రంలోని చెరువులు కుంటలలో చేప పిల్లల సప్లై కోరుతూ ఆహ్వానిస్తున్న టెండర్ల ప్రక్రియను ఆపివేయాలని  దరఖాస్తును ఇవ్వడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ఉచిత చేప పిల్లల పథకం అమలవుతున్న తీరు దళారులకు కొందరు అధికారులకు కాసుల పంట గా మారిందని మత్స్యకారుల ఎదుగుదలకు ఏమాత్రం ఉపయోగ పడతలేదని అందుకు ప్రత్యామ్నాయంగా నేరుగా చెరువు మత్స్య సొసైటీల అకౌంట్లకు నగదు బదిలీ చేయాలని లేదా రాష్ట్రంలోని నిరుద్యోగులచే చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను పెట్టించి వారిచే రాష్ట్రంలోని అన్ని చెరువులు కుంటలకు నాణ్యమైన చేప పిల్లలను సప్లై చేయాలని అన్నారు. రాష్ట్ర అధ్యక్షురాలు శీలం సరస్వతి ముదిరాజ్  రాష్ట్ర ఉపద్యక్షురాలు కోట్ల పుష్పలత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు ఆర్ధిక అభివృద్ధి ని కల్పించాలనే సదుద్దేశంతో ఇస్తున్న సబ్సిడీ మత్స్యవాహనాల పథకం దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేసారు.దళారులు కొంతమంది మత్స్యశాఖ అక్రమార్క అధికారులతో కుమ్మక్కై ఇటు మత్స్యకారుల ను అటు ప్రభుత్వాన్ని మోసం చేస్తూ కోట్ల రూపాయల విలువైన వాహనాలను కాజేస్తున్నారంటూ చేప పిల్లల అక్రమాలకు సంబంధించి  అధ్యక్షులు లోకనబోయిన రమణ ముదిరాజ్ తగిన ఆధారాలు సేకరించారని త్వరలోనే వారి మీద చర్యలు తప్పవని హెచ్చరించారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

 

Tags: The brokerage system should be abolished in the free fish fry scheme

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *