బాలిక దారుణ హత్య
ఒంగోలు ముచ్చట్లు:
బాలికను దుండగులు దారుణంగా హత్య చేసిన ఘటన మంగళవారం కనిగిరి మండలంలోని ఎం.గొల్లపల్లి గ్రామంలో జరిగింది. గ్రామంలోని ఆంజనేయస్వామి గుడి వెనుక పొలాల్లో గుర్తు తెలియని బాలికను దుండగులు దారుణంగా హత్య చేశారు. గుర్తుపట్టకుండా బాలిక మొఖాన్ని రాయితో ఛిద్రం చేశారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. బాలిక వయస్సు సుమారు 12 సంవత్సరాలు ఉండవచ్చని అంచనా వేశారు. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Tags: The brutal murder of the girl

