Natyam ad

విద్యుత్ మీటర్ల భారం 3 వేల కోట్లపైనే

రాజమండ్రి ముచ్చట్లు:


విద్యుత్‌ రంగ ప్రైవేటీకరణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రీవ్యాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ స్కీం(ఆర్‌డిఎస్‌ఎస్‌)ను అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశలో వేగంగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని విద్యుత్‌ వినియోగదారులందరికీ ప్రీ పెయిడ్‌ మీటర్లను ఏర్పాటు చేయడానికి విద్యుత్‌ సంస్థలు చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను వివిధ డిస్కామ్‌లు సిద్ధం చేశాయి. ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపణీ సంస్థ (ఎపిఇపిడిసిఎల్‌) ప్రతిపాదనలను విద్యుత్‌ నియంత్రణ మండలి( ఇఆర్‌సి)కి ఇప్పటికే అందచేసింది. తన పరిధిలోని 5 సర్కిళ్లలో మీటర్లు అమర్చేందుకు రూ.947.15 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఆ సంస్థ పేర్కొంది. రూ.1,657.66 కోట్లతో ఎపి దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎస్‌పిడిసిఎల్‌), రూ.1,507.62 కోట్లతో ఎపి మధ్య ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎపిసిపిడిసిఎల్‌) ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. త్వరలోనే ఈ రెండు సంస్థలు ఇఆర్‌సికి సమర్పించనున్నాయి. ఈ సంస్థల నుండి ప్రతిపాదనలు అందిన వెంటనే ఇఆర్‌సి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను ఆదుకోవడానికి బదులుగా అదనపు రుణంకు అనుమతిచ్చే పేర కేంద్ర ప్రభుత్వం ఆర్‌డిఎస్‌ఎస్‌ను ప్రతిపాదించిన విషయం తెలిసిందే.

 

 

 

విద్యుత్‌ పంపిణీ సంస్థల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ప్రాంఛైజీలు ఏర్పాటు చేసుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం ఆర్‌డిఎస్‌ఎస్‌లో పొందుపరిచింది. దీంతో ప్రభుత్వ పంపిణీ సంస్థలకు సమాంతరంగా కార్పొరేట్‌ పంపిణీ సంస్థలు కూడా ఏర్పాటు కానున్నాయి. ఆ సంస్థలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు, ఆదాయాన్ని గ్యారంటీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రీపెయిడ్‌ మీటర్లను తెరపైకి తీసుకొచ్చింది. ఈ మీటర్లు వస్తే ఫోన్‌, టివిలకు ముందుగానే రీఛార్జ్‌ ఎలా చేసుకున్నామో అలానే విద్యుత్‌కు కూడా రీఛార్జ్‌ చేసుకోవాలి. నెట్‌వర్క్‌ నిరంతరాయంగా అందించే పేరుతో వివిధ ప్యాకేజ్‌లను టెలికాం, టెలివిజన్‌ కంపెనీలు తీసుకొచ్చాయి. విద్యుత్‌ రంగంలో కూడా వివిధ రకాల ప్యాకేజ్‌లు రంగంలోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.మీటర్ల ఏర్పాటుకు అయ్యే భారం ప్రజలపైనే పడనుంది. వీటి ఏర్పాటుకు రూ.4,112 కోట్లు ఖర్చవుతుందని మూడు పంపిణీ సంస్థలు అంచనా వేశాయి. రాష్ట్రంలో 1.92 కోట్ల మంది విద్యుత్‌ వినియోగదారులు ఉన్నారు. వీరిలో సుమారు 18.5 లక్షల మంది వ్యవసాయ వినియోగదారులకు స్మార్ట్‌ మీటర్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. మిగిలిన వినియోగదారులందరికీ మీటర్లను బిగించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టులో కేవలం 15 శాతమే కేంద్రం గ్రాంటు రూపంలో ఇస్తుంది. సకాలంలో బిగిస్తే అదనంగా 7.5 శాతం వరకూ మొత్తం ఇస్తామని పేర్కొంది. దీనిని కలుపుకున్నా కేంద్రం ఇచ్చేది 22.5 శాతం మాత్రమే! అంటే మీటర్లకు అయ్యే రూ.4,112 కోట్లలో కేవలం రూ.850 కోట్ల వరకు మాత్రమే కేంద్రం ఇస్తుంది. మిగిలిన రూ.3,260 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేయాలి. దీంతో ఈ భారం ఏదో రూపంలో వినియోగదారులపైనే పడనుంది. ఆర్‌డిఎస్‌ఎస్‌లో అమలు చేస్తున్న పనులను 2026 మార్చి 31లోపు పూర్తి చేస్తేనే గ్రాంట్లు వర్తిస్తాయని కేంద్రం షరతు విధించింది.

 

 

 

Post Midle

ఆ తేదీ దాటిన మరుక్షణం వర్తించవని నిబంధన విధించింది. అదేవిధంగా మీటరుకు గ్రాంటు రావాలంటే బిగించిన తరువాత వినియోగదారుడు కనీసం ఒక్కసారైన రీఛార్జ్‌ చేయాలనే నిబంధన విధించింది. ఐదేళ్ల క్రితం టివిలకు కూడా సెటాప్‌ బాక్స్‌ బిగించాలనే పేరుతో ఒక్కో బాక్స్‌కు ప్రజల నుంచి సుమారు రూ.2,500 వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అదే విధానాన్ని అమలు చేసే అవకాశం ఉంది.వినియోగదారులు బిల్లులు చెల్లించకపోవడం వల్లే విద్యుత్‌ సంస్థలకు నష్టాలు వస్తున్నాయనే ప్రచారాన్ని ప్రభుత్వం చేస్తోంది. వాస్తవంగా వినియోగదారులంతా బిల్లులను సకాలంలో చెల్లిస్తున్నారు. కేవలం 1 శాతం మంది మాత్రమే గడువు తీరిన తరువాత అదీ అపరాధ రుసుంతో చెల్లిస్తున్నారు. నిజానికి ప్రభుత్వం నుంచి డిస్కమ్‌లకు రావాల్సిన బకాయిలు రాకపోవడంతోనే నష్టాల బాటపడుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల బిల్లులు, సబ్సిడీ రూపంలో రావాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదు. వాస్తవం. రాష్ట్రంలో 12,918 గ్రామ పంచాయతీల నుంచి రూ.3,643 కోట్లు విద్యుత్‌ సంస్థలకు రావాల్సి ఉంది. జలవనరులశాఖ, ఇతర ప్రభుత్వ కార్యాలయాల నుంచి కూడా వేల కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారు రూ.36 వేలకోట్ల బకాయిలు విద్యుత్‌ పంపిణీ సంస్థలకు రావాల్సి ఉంది.

 

 

ఈ మీటర్లు వల్ల వినియోగదారులకు విద్యుత్‌ బిల్లుల్లో కచ్చితత్వం ఉంటుందని, ఎలాంటి లోపాలు ఉండవని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్‌ తెలిపారు. మీటర్ల ఏర్పాటుపై కేంద్ర విద్యుత్‌ శాఖ, బ్రిటన్‌కు చెందిన ఫారిన్‌ కామన్‌ వెల్త్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీస్‌ సంయుక్తంగా రాష్ట్ర డిస్కమ్‌ల అధికారులకు స్మార్ట్‌ మీటర్లపై అవగాహన సదస్సు జరిగింది. దీని వివరాలను మంత్రి పెద్దిరెడ్డి, విజయానంద్‌ ఆదివారం వివరించారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 25 కోట్ల స్మార్ట్‌ మీటర్లను అమర్చాలని నిర్ణయించిందని తెలిపారు. రోజువారీ విద్యుత్‌ వినియోగాన్ని వినియోగదారులు ఆన్‌లైన్‌లో పరిశీలించుకోవచ్చునని వివరించారు.

 

Tags: The burden of electricity meters is 3 thousand crores

Post Midle