స్టాలిన్ పైనే భారం 

Date:03/07/2020

చెన్నై ముచ్చట్లు:

డీఎంకే అధినేత స్టాలిన్ ఆశలు నెరవేరతాయా? లేదా? ఇదే డీఎంకే శ్రేణుల ముందున్న ప్రశ్నం. వచ్చే ఏడాది తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే డీఎంకే పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉంది. ఈసారి ఎన్నికలు స్టాలిన్ కు ప్రతిష్టాత్మకం. కరుణానిధి లేకుండా జరుగుతున్న ఎన్నికలు కావడంతో స్టాలిన్ పైనే పూర్తి భారం ఉంది. గెలుపోటములకు ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుంది.అయితే డీఎంకే అధినేత స్టాలిన్ కు అనేక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఒకవైపు అన్నాడీఎంకే తో పోటీ పడాల్సి ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల నాటికి అనేక రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. రజనీకాంత్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశముంది. రజనీకాంత్ తో బీజేపీ పొత్తు పెట్టుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే డీఎంకే అధినేత స్టాలిన్ కు వచ్చే ఎన్నికల్లో విజయావకాశాలు తక్కువగానే ఉన్నాయంటున్నారు.గత పార్లమెంటు, శాసనసభ ఎన్నికలలో డీఎంకే సత్తా చాటింది.

 

 

 

 

అత్యధిక స్థానాలను గెలుచుకుని డీఎంకే తమిళనాడులో దుమ్ము రేపింది. దీంతో స్టాలిన్ లో ఆత్మవిశ్వాసం పెరిగింది. కానీ రోజురోజుకూ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అధికార అన్నాడీఎంకే మళ్లీ శశికళ సారథ్యంలో ఎన్నికలకు వెళుతుందన్న ప్రచారం ఉంది. అలాగే స్టాలిన్ సోదరుడు ఆళగిరి సయితం బీజేపీ వైపు వెళతారన్న వదంతులు ఉన్నాయి. అదే జరిగితే మధురై ప్రాంతంలో స్టాలిన్ పార్టీకి దెబ్బతగలక మానదు.అందుకే స్టాలిన్ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను నియమించుకున్నారు. రజనీకాంత్, అధికార అన్నాడీఎంకేలను తట్టుకోవాలంటే ప్రశాంత్ కిషోర్ సేవలు అవసరమని భావిస్తున్నారు. ఏపీ, ఢిల్లీలో గట్టెక్కించినట్లే ప్రశాంత్ కిషోర్ తమను ఒడ్డున పడేయగలడని స్టాలిన్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద వచ్చే ఎన్నికలు స్టాలిన్ కు పరీక్ష అని చెప్పక తప్పదు. మరి ఆయన వ్యూహాలు ఏ మేరకు పనిచేస్తాయన్నది కాలమే నిర్ణయించాలి.

మారిపోతున్న గోవా 

Tags: The burden on Stalin itself

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *