కోల్ బెల్ట్ లో మండే సూరీడు 

Date:15/05/2019
అదిలాబాద్ ముచ్చట్లు:
వేసవికాలం కావడంతో కోల్ బెల్ట్ మండుతున్న నిప్పులకొలిమిలా మారింది…   ఎర్రటి ఎండలో కార్మికులు పనిచేయాడానికి బొగ్గు గని కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు..బొగ్గు గనులు అధికంగా ఉన్నచోట సాధారణంగానే ఎండలు ఎక్కువగా ఉంటాయి… అయితే బొగ్గుగనుల్లో పనిచేసే కార్మికులు పెరుగుతున్న వేడితో తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కుంటున్నారు..  అండర్ గ్రౌండ్  కార్మికులతో పోలిస్తే ముఖ్యంగా ఓపెన్ కాస్టు  ప్రాజెక్టుల్లో పనిచేసే కార్మికులు  ఎండలవేడిని భరించలేకపోతున్నారు… సింగరేణి యాజమాన్యం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినప్పటికీ ఎండల వేడిని కార్మికులు ఏమాత్రం తట్టుకోలేక పోతున్నారు.. కేవలం రాత్రి షిప్టు కార్మికులే ఓసీల్లో పనిచేసేలా పరిస్థితలున్నాయి.. ఇక అండర్ గ్రౌండ్ కార్మికులు కూడా ఇంటి నుంచి వచ్చేటపుడు, డ్యూటీ ముగించుకుని తిరిగి ఇంటికెళ్లేటపుడు ప్రచండ భానుడి తాపానికి ఉక్కిరి బిక్కిరవుతున్నారు.. రాష్ట్రంలోనే అత్యధికంగా ఊష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతాల్లో బొగ్గుగనుల నిక్షేపాలున్న మందమర్రి,బెల్లంపల్లి, మంచిర్యాల,  ప్రాంతాల్లో ఎండల ప్రభావం కార్మికులపై తీవ్ర ప్రభావం చూపెడుతున్నాయి… బొగ్గుగనులున్న ప్రాంతంలో  ఎండలు దంచికొడుతుండటంతో సింగరేణి కార్మికులతో పాటు సాధారణ జనం కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నారు.. ఎండల ప్రభావంతో సింగరేణి గనుల్లో కార్మికుల హాజరుశాతం పై ప్ర‌భావం ప‌డుతోంది..
తీవ్రమైన ఎండల ప్రభావంతో పగటి సమయాల్లో ప్రధాన రోడ్లన్ని కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి..ఓపెన్ కాస్టులు ఉన్న ప్రాంతంలో ఎండల తీవ్రత అధికంగా ఉండటానికి కారణం బొగ్గు నిల్వలే అని నిపుణులు చెబుతున్నారు.. నల్లగా ఉండే బొగ్గు వేడిని తొందరగా గ్రహించడం ఒకటైతే బొగ్గును తీసేందుకు పేలుడు పదార్థాలు ఉపయోగించడం వల్ల స్టోన్ డస్ట్ గాలిలో కలిసి ఊష్ణాన్ని గ్రహిస్తుంది.. ఇవి రెండు అక్కడున్న వాతావరణంలో గాలి వేడెక్కడానికి దోహదపడుతాయి…. పరిశ్రమల నుంచి వచ్చే వాయుకాలుష్యం దీనికి తోడవుతుండటంతో కోల్్బెల్ట్ ప్రాంతాల్లో సాధారణం కన్నా ఎక్కువగా వేడి ఉంటోంది… పెరుగుతున్న వేడి కారణంగా కార్మికులతో పాటు కోల్్బెల్ట్ ప్రాంత వాసులు అల్లాడిపోతున్నారు.. సింగరేణి యాజమాన్యం బొగ్గుగనులపై చల్లని నీటి సౌకర్యంతో చలువ పందిళ్లు, రెస్ట్్రూంల్లో కూలర్లు ఏర్పాటు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.. ఓసీపీల్లో ప‌నిచేసే కార్మికుల‌కు ఇప్ప‌టికే యాజ‌మాన్యం ఓఆర్ఎస్, మ‌జ్జిగ ప్యాకెట్ల‌ను అందుబాటులో ఉంచింది.. గ‌నుల్లో గ‌డ్డితో తాత్కాళిక షెడ్ల‌ను ఏర్పాటు చేసిందిమొత్తానికి పర్యావరణ కాలుష్యం పెరగడం, భూతాపం పెరగడం కారణంగా ఎండలు అదరగొడుతున్నాయి.. ఇక సింగరేణి గనులున్న ప్రాంతాల్లో గరిష్ట ఊష్ణోగ్రత 50 డిగ్రీలు దాటితే గనులకు సెలవు ప్రకటించాల్సి వస్తుంది.. అయితే కొన్ని ప్రాంతాల్లో ఒక్కోరోజు ఊష్ణోగ్రతలు పెరిగినా కానీ 50 డిగ్రీల కన్నా తక్కువగా ఉన్నట్లు చూపించి పనులు జరిపిస్తున్నారని కార్మికవర్గం ఆరోపిస్తోంది.
Tags: The burning sun in the belt

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *