Natyam ad

అదుపుతప్పి వంతెనపై నుంచి రైల్వే ట్రాక్‌పై పడిపోయిన బస్సు

– నలుగురు ప్రయాణికులు మృతి

 

జైపూర్‌  ముచ్చట్లు:

Post Midle

రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. సోమవారం తెల్లవారుజామున 2.15 గంటలకు హరిద్వార్‌ నుంచి ఉదయ్‌పూర్‌ వెళ్తున్న బస్సు దౌసా కలెక్టరేట్‌ సమీపంలో అదుపుతప్పి వంతెనపై నుంచి రైల్వే ట్రాక్‌పై పడిపోయింది. దీంతో నలుగురు ప్రయాణికులు మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రమాద సమయంలో ఆ ట్రాక్‌పై ఏ రైలూ రాకపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పినట్లయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున 2.15 గంటలకు జరిగినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని వెల్లడించారు.

 

Tags: The bus fell off the bridge and onto the railway track

Post Midle