చెట్టుకు ఢీకొట్టిన బస్సు…ప్రయాణికులకు గాయాలు

కొవ్వూరు ముచ్చట్లు:


ఆర్టీసీ పల్లె వెలుగు  బస్సు  బ్రేక్ ఫెయిల్ కావడంతో చెట్టుకు ఢీకొంది. ఘటనలో డ్రైవర్ కు,ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మెరక వీధి సెంటర్లో జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద పోలవరం నుంచి రాజమండ్రి వెళ్తున్న కొవ్వూరు డిపోకు చెందిన బస్సు కు ప్రమాదం జరిగింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో  డ్రైవర్ చాకచక్యంతో ఎదురుగా ఉన్న ఆటోని తప్పించిపోయి చెట్టును ఢీ కొట్టించారు. ప్రమాదం తృటి లో తప్పింది. బస్సులో  25 మందికాలేజీ విద్యార్థులు, 44 మంది  ప్రయాణికులు తో సుమారుగా 69 మంది ఉన్నట్లు సమాచారం. అటుగా వెళుతున్న కొవ్వూరు మున్సిపల్ చైర్ పర్సన్ భావన రత్నకుమారి యాణికులకు పరామర్శించారు. గాయాలు పాలైన ప్రయాణికుల్ని 108 లో ఆసుపత్రికి తరలించారు.

 

Tags: The bus hit a tree…passengers were injured

Leave A Reply

Your email address will not be published.