బస్సు బోల్తా…పోలీసు జవాను మృతి
ఒంగోలు ముచ్చట్లు:
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుండి అనంతపురం వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సు పాదచారుడిని తప్పించబోయింది. అయితే, పాదచారుడిని ఢీ కొట్టిని బస్సు ముందున్న లారీని ఢీకొని బోల్తా పడింది. పాదచారుడు సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సాంబశివుడు మృతి చెందగా..బస్సులో ప్రయాణిస్తున్న మొత్తం 30 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారందరినీ పోలీసులు 108 వాహనంలో కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Tags: The bus overturned…a policeman was killed