ఉపా చట్టాన్ని రద్దు చేయాలి

గిరిజన హక్కుల కార్యకర్త స్టాన్ స్వామికి నివాళి
గిరిజన సంఘం రాష్ట్ర ప్రాధన కార్య దర్శి పి.అప్పల నర్సా

విశాఖపట్నం ముచ్చట్లు:
గిరిజన హక్కుల కార్యకర్త స్టాన్ స్వామి మృతి కేంద్ర ప్రభుత్వ హత్య అని,ఉపా చట్టం రద్దు చేయడం ద్వారా దేశంలో ప్రజాస్వామ్యం రక్షణ సాధ్యమని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స అన్నారు.
పాడేరు గిరిజన సంఘం కార్యాలయంలో గిరిజన హక్కుల కార్యకర్త స్టాన్ స్వామి గారు దేశంలో ఉన్న గిరిజన హక్కులపై పోరాటం చేస్తున్న గొప్ప నాయకుడైని,స్వామిగారి పై తప్పుడు కేసు నమోదు చేసిన కేంద్ర ప్రభుత్వం కనీసం మానవ హక్కులను కూడ గుర్తించకుండా నియంత వ్యహరించడం తగదని, మనిషిని మనిషిగా చూడని చట్టాలను దేశంలో అమలు చేయడం దారుణంగా ఉందని విమర్శించారు.
బీమా కో రేగావ్ కేసులో సహా నిందితుడుగా చేర్చిన ఎన్. ఐ. ఏ ఏనాడు ప్రాథమిక విచారణ కుకూడ పాల్గొలేదని,ముంబై హైకోర్టులో బెయిల్ పిటిషన్ పై కేంద్ర ప్రభుత్వం అడ్డుకుందినందని, కరోన సోకిన మెరుగైన వైద్యం అందించలేదని,వృదుడైన కనీసం మానవత్వం లేకుండా కేంద్ర ప్రభుత్వం వ్యహరించడం అన్యాయం. స్టాన్ స్వామి గారిది సహజ మరణం కాదని,ఇది కేంద్ర ప్రభుత్వ హత్యాని గిరిజన సంఘం భావిస్తుంది.అక్రమ కేసులు, అరెస్టులతో హక్కుల ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు.
ఇప్పటికే మైనింగ్ తవ్వకాలకు కోసమే కార్పొరేట్ సంస్థల కు 44 బొగ్గు గనుల కేటాయింపు చేసారని,కరోన కాలంలో గిరిజనుల నూరు శాతం రిజర్వేషన్ను, అటవీ హక్కులను  సుప్రీంకోర్టు ద్వారా రద్దు చేసారని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పి.లాక్కు,జిల్లా ప్రధాన కార్యదర్శి కె.పృద్వి రాజ్,జిల్లా ఉపాధ్యక్షుడు జె.దిన బంద్,ఎస్.ఎఫ్.ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:The by-law should be repealed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *