ఒట్ల లెక్కింపు ప్రక్రియ పక్కాగా నిర్వహించాలి 

– రాష్ట్ర ప్రత్యేక కౌంటింగ్ పరిశీలకులు  వినోద్ జూస్తీ

 

Date:21/05/2019

పెద్దపల్లి  ముచ్చట్లు:

ఒట్ల లెక్కింపు ప్రక్రియ పక్కాగా నిర్వహించేలా  తగిన  ఎర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రత్యేక కౌంటింగ్ పరిశీలకులు వినోద్ జుస్తీ సంబంధిత అధికారులను ఆదేశించారు.  పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ తో కలిసి రాష్ట్రంలోని  రిటర్నింగ్ అధికారులు, జిల్లా ఎన్నీకల అధికారులు, ఎఆర్వోలు, పోలిస్ ఉన్నతాధికారులతో  మంగళవారం దూరదృశ్య సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రంలో గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలో  కౌంటింగ్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించారని, అదే విధంగా పార్లమెంట్ ఎన్నికల  కౌంటింగ్ సైతం పకడ్భందిగా ఎలాంటి పోరపాటు లేకుండా జరగాలని  ఆయన అధికారులను ఆదేశించారు. పార్లమెంట్  కౌంటింగ్ నేపథ్యంలో  అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగావుండాలని, ఎన్నికల కమిషన్ సూచనలను తప్పనిసరిగా పాటించాలని  తెలిపారు.  ప్రతి పార్లమెంట్ పరిధిలో 5 వివిప్యాట్లను లెక్కించాల్సి ఉంటుందని, వాటికి ఈవిఎం ఫలితాలకు తేడా ఉంటే ఆ విషయాన్నీ  రిటర్నీంగ్ అధికారి కమిషన్ దృష్టికి తీసుకొని వచ్చి నిబంధనల మేరకు  తదుపరి చర్యలు తీసుకోవాలని  ఆయన సూచించారు.  కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలిసు వారు పటిష్ట బందోబస్తు ఎర్పాటు చేయాలని అన్నారు.

 

 

 

 

 

ప్రతి  కౌంటింగ్ కేంద్రం వద్ద సకాలంలో  కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించాలని,  కౌంటింగ్ కేంద్రం వద్ద  సీల్  తెరిచే సమయంలో  కౌంటింగ్ ఏజేంట్లు ఉండేలా చుడాలని ఆయన  తెలిపారు.  కౌంటింగ్ సూపర్ వైజర్లు,  కౌంటింగ్ అసిస్టెంట్లు వారికి కేటాయించిన  టేబుళ్ల వద్ద ఈవిఎం  యంత్రాల కౌంటింగ్ నిర్వహించే సమయంలో ఫలితాలను  ఎజెంట్లకు చుపాలని, వారు నోట్ చేసిన అనంతరం తదుపరి రౌండ్ కు వెళ్లాలని  సూచించారు.  కౌంటింగ్ కేంద్రం వద్ద అభ్యర్థులు లేదా ఏజేంట్ల వద్ద నుంచి  రికౌంటింగ్ డిమాండ్ వస్తే  రిటర్నింగ్ అధికారి ఎన్నికల నిబంధనల మేరకు పరిశీలించాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు.  బ్యాలేట్ ఒట్లు లేక్కింపు సమయంలో  తిరస్కరించిన బ్యాలేట్ ఒట్లను పక్కన పెట్టాలని, ఒకవేళ  అభ్యర్థి మెజారిటీ కంటే  తిరస్కరించిన బ్యాలేట్ ఒట్లు అధికంగా ఉంటే వాటిని సైతం పరిగణలోకి తీసుకోవాలని  తెలిపారు.

 

 

 

 

 

 

 

ఎన్నికల్లో పోటి చేసిన అభ్యర్థుల దగ్గర నుండి వారి కౌంటింగ్ ఏజేంట్లకు సంబంధించిన సమాచారం తీసుకోని వారికి ముందస్తుగా ఎంట్రీ పాస్ లు అందించాలని  తెలిపారు.  కౌంటింగ్  కేంద్రాల వద్ద  ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఎర్పాట్లు చేయాలని,  మొబైల్ డిపాజీట్ కేంద్రాలను సిద్దం చేయాలని,  కౌంటింగ్ కేంద్రాల సిసి కేమేరాలను ఎర్పాటు చేయాలని,  కౌంటింగ్ హల్ లకు  ఎంట్రీ మరియు ఎక్సిట్ సెపరేట్ గా ఉండాలని  తెలిపారు. రౌండ్ల వారిగా ఫలితాలను  సువిధా యాప్ లో  రిటర్నీంగ్ అధికారి నమోదు చేసిన తరువాత మాత్రమే మీడియా వారికి విడుదల చేయాలని  తెలిపారు. రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా పాలనాధికారి శ్రీదేవసేన,  ఎన్నీకల సాధారణ పరిశీలకులు రాజారాం,  రామగుండం పోలిస్ కమిషనర్ సత్యనారాయణ, డిసిపి సుదర్శన్ గౌడ్, గోదావరిఖని ఎసిపి రక్షిత కే మూర్తి, సంబంధిత అధికారులు, తదితరులు ఈ దూరదృశ్య సమీక్షలో  పాల్గోన్నారు.

 

వడగాల్పుల హెచ్చరిక

Tags: The calculation process should be performed properly

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *