కారు ద్విచక్రవాహనం ఢీ

-ముగ్గరికి తీవ్రగాయాలు
-ఇద్దరి పరిస్థితి విషమం

 

చిత్తూరు ముచ్చట్లు :

 

 

చిత్తూరు జిల్లా వి.కోట మండలం జవ్వునిపల్లి క్రాస్ సమీపంలో కర్నాటక నుంచి మద్యం తరలిస్తున్న కారు.. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొనడంతో   ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా మరొక్కరు తీవ్రంగా గాయపడ్డారు.రాత్రి వి.కోట నుండీ వెళ్ళుతున్న కారును ఎదురుగా  వస్తున్న  ద్విచక్రవాహనం అడ్డురాగా దానిని తప్పించేందుకు ప్రయత్నించినా ఫలితం లేక పోగా కారు.. టూవీలర్ లు డీ కొన్నాయి.  ప్రమాదం జరిగిన వెంటనే గాయపడ్ధ వారిని పరిశీలించ కుంఢా కారులో ఉన్న మద్యాన్ని పక్కకు పడేసేందుకు అందులోని మహిళ.. డ్రైవర్ ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన స్థానికులు గమనించి పోలీసులకు తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ యువకులను ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం వీరిని కుప్పం ఆస్పత్రికి తరలిస్తున్నారు. సి ఐ ప్రసాద్ బాబు ఘటనాస్థలానికి చేరుకుని కారు సహా నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు .

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags:The car collided with a motorcycle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *