డివైడర్ ను ఢీకొన్న కారు..మహిళ మృతి
నెల్లూరు ముచ్చట్లు:
కావలి రూరల్ మండలం జాతీయ రహదారిపై గౌరవరం వద్ద ఒక కారు రోడ్డు డివైడర్ను ఢీకొట్టింది. ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరికీ స్వల్ప గాయాలు అయ్యాయి. మృతురాలు డీవీ సత్రం తనియాలి గ్రామ మాజీ సర్పంచ్ సంచి రవణమ్మ (60)గా గుర్తించారు. హైదరాబాదు నుండి ఉమ్మడి నెల్లూరు జిల్లా దొరవారి సత్రం (మం )తనియాలి వెళుతుండగా ఘటన జరిగింది. ప్రమాద సమయంలో కారులో ఐదు మంది వున్నారు. క్షతగాత్రులను 108 వాహనంలో కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు.
Tags: The car hit the divider…a woman died

