డివైడర్ ను ఢీకొట్టిన కారు..ఆరుగురికి గాయాలు

నందిగామ ముచ్చట్లు:


ఎన్టీఆర్ జిల్లా నందిగామ  వై జంక్షన్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని పల్టీ కొట్టింది. ఘటనలో ఆరుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. వారిని  నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు  హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతోంది. అతివేగం ఒక కారణం అయితే రోడ్డు పూర్తిగా దెబ్బతినటం మరో కారణమని స్థానికులుఅంటున్నారు. క్షతగాత్రులు హైదరాబాదుకు చెందిన వారు.  సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు.

 

Tags: The car hit the divider, six people were injured

Leave A Reply

Your email address will not be published.