ఫ్లై ఓవర్ పై నుంచి పడిన కారు…ఒకరు మృతి

Date:18/02/2020

హైదరాబాద్ ముచ్చట్లు:

నగరంలోని భరత్నగర్ బ్రిడ్జ్ పై కారు బీభత్సం సృష్టించింది. కూకట్ పల్లి నుంచి సనత్ నగర్ వైపు వస్తున్న ఓ కారు అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి కిందపడిపోయింది. మంగళవారం

తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సోహెల్ అనే వ్యక్తి మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఉన్నారని,

వీరంతా మిత్రులుగా తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు బోరబండ పండిట్ నెహ్రూనగర్ కు

చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన తీరుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాత్రి 10:30 గంటలకు వీరంతా ఇంటి నుంచి బయటకు వెళ్లారని తెల్లవారుజామున 2:30

గంటలకు ప్రమాదం జరిగిందని బంధువులు చెబుతున్నారు. ప్రమాదానికి గురైన కారుపై పలు ఈ ఛలాన్లు నమోదయ్యాయి.

లగడపాటి ఎక్కడో…

Tags: The car that fell off the flyover … One died

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *