బండి లాగేశారు 

Date:05/12/2020

హైదరాబాద్ ముచ్చట్లు:

అసెంబ్లీలో ఒక్క సీటు… పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు స్థానాలు… దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇరవైకి పైగా డివిజన్లలో గెలుపు. ఇది చాలదూ బీజేపీ తెలంగాణలో బలపడుతుంది అని చెప్పడానికి. అవును. బీజేపీయే ఇప్పుడు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మారింది. ప్రజలు కూడా అదే భావించారు. అందుకే కాంగ్రెస్ ను వెనక్కు నెట్టి టీఆర్ఎస్ తర్వాత అత్యధిక స్థానాల్లో బీజేపీని గెలిపించారునిజానికి బీజేపీకి తొలి నుంచి హైదరాబాద్ లో పట్టు ఉండేది. ఆలే నరేంద్ర, బద్దం బాలిరెడ్డి వంటి నేతలు బీజేపీకి హైదరాబాద్ లో ఫౌండేషన్ వేశారు. అప్పటి నుంచి అరకొర సీట్లను గెలుస్తూ వచ్చింది. గత ఎన్నికలలో బీజేపీ టీడీపీతో కలసి 45 స్థానాల్లో పోటీ చేసి నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఈసారి ఒంటరిగా పోటీకి దిగింది. జనసేనను కూడా పక్కన పెట్టి తానే అన్ని స్థానాల్లో పోటీ చేసింది.

 

 

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి బీజేపీ మేయర్ సీటును తన్నుకుపోతుందని ఎవరూ అంచనాలు వేయలేదు. గతంలో కంటే బలం పెంచుకుంటుదన్న విశ్లేషణలే వెలువడ్డాయి. బీజేపీ నేతలు కూడా ఆ దిశగానే పోరాటం చేశారు. అధికారంలోకి రాకపోయినా బీజేపీ హైదరాబాద్ లో విజయం సాధించినట్లే. అయితే బీజేపీ నేతలు చేసుకున్న స్వయంకృతాపరాధం కారణంగా కొన్ని సీట్లు చేజారిపోయాయని చెప్పక తప్పదు. ఎంఐఎంను టార్గెట చేస్తే హిందువుల ఓట్లను కొల్లగొట్టేయొచ్చన్న బీజేపీ వ్యూహం పెద్దగా ఫలించలేదు.రెచ్చగొట్టే వ్యాఖ్యల కారణంగా తటస్థులు బీజేపీ వైపు చూడలేదన్నది అర్థమవుతుంది. వ్యాపార వర్గాలు కూడా బీజేపీ వైపు చూడలేదంటున్నారు. అలాగే సెటిలర్లు కూడా కొంత భయపడి బీజేపీ వైపు మొగ్గు చూపలేదు. ఏపీ రాజధాని అమరావతి అంశంలో బీజేపీ అనుసరిస్తున్న వైఖరి కూడా ఇక్కడ ఒక సామాజికవర్గం ఆ పార్టీకి దూరమయిందంటున్నారు. మొత్తం మీద ఎన్ని వచ్చినా పోయిందేమీ లేదు. జరిగే నష్టమేమీ లేదు. వచ్చే ప్రతి సీటూ రానున్న కాలానికి విజయానికి మెట్టులాంటిదని బీజేపీనేతలు చెబుతున్నారు.

https://www.telugumuchatlu.com/punganur-mpp-candidate-akkisani-bhaskarreddys-birthday-celebrations-2/పుంగనూరు ఎంపీపీ అభ్యర్థి అక్కిసాని భాస్కర్‌రెడ్డి జన్మదిన వేడుకలు

Tags: The cart was pulled

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *