తలనీలాలు తీస్తున్న వ్యక్తి పై కేసు

జగిత్యాల ముచ్చట్లు:
 
జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలో అనుమతి లేకుండా తలనీలాలు తీస్తున్న వ్యక్తిపై సోమవారం మల్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. పెగడపల్లి మండలం ఐతుపల్లకు చెందిన సాగర్ అనే వ్యక్తి ఆలయానికి వచ్చే భక్తులకు తలనీలాలు తీస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నట్లు ఆలయ ఈ ఓ మల్యాల స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. దేవాలయంకు సంబంధం లేని వ్యక్తి కావడంతోపాటు ఆలయ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా సదరు వ్యక్తి ప్రవర్తించాడని పోలీస్ స్టేషన్లో ఆలయ ఈ ఓ సాగర్ పై ఫిర్యాదు చేశారు. దింతో ఎస్ ఐ చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
Tags: The case against the beheading man

Leave A Reply

Your email address will not be published.