నాయిని ప్రకటనపై కేసు నమోదు చేయాలి : రేవంత్ రెడ్డి

The case should be registered against Nai's statement: Revant Reddy

The case should be registered against Nai's statement: Revant Reddy

Date:12/10/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి శుక్రవారం రెండు ప్రధాన అంశాలు ప్రస్తావించారు. ఒకటి కేసీఆర్ తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని, ఇంకోటి  నియోజకవర్గం మారేందుకు కేసీఆర్ పదికోట్లు ఇస్తామని చెప్పారన్నారు. అయన ప్రకటన ను సుమోటోగా తీసుకుని కేసుపెట్టాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేసారు.  శుక్రవారం నాడు అయన మీడియతో మాట్లాడారు. ముషీరాబాద్ సీట్ నాకన్నా, నాఅల్లుడికైనా ఇవ్వమంటే కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వలేదని నాయిని అన్నారు. టిఆర్ఎస్ లో మొదటి నుంచి కేసీఆర్ వెన్నంటి ఉన్న.
నాయినికి నెలరోజులుగా అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే అది అవమానం కాదా అని ప్రశ్నించారు. తనను ఎల్బి నగర్ లో పోటీ చేయమన్నారని,   అక్కడ చేసేందుకు పది కోట్లు ఇస్తానని కేసీఆర్ చెప్పారన్నారు  నాయిని. టికెట్ ఇవ్వకపోయినా, నాయినికి కనీసం అపాయిమెంట్ ట్ ఇవ్వడం లేదంటే, పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉద్యమకారుడు, నీతి నిజాయితీ అని చెప్పుకునే కేసీఆర్ నియోజకవర్గానికి 10కోట్లు ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డారుని అయన విమర్శించారు. ఈడీ దాడులు మోడీ, కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని అయన ఆరోపించారు.
Tags:The case should be registered against Nai’s statement: Revant Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *