ఎంఐఎం ఎమ్మెల్యే పై కేసు నమోదు చేయాలి

Date:09/05/2020

హైదరాబాద్  ముచ్చట్లు:

చాదరఘాట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ దళిత మైనర్ బాలికను ఒక యువకుడు షకీల్ అత్యాచారానికి ఒడికట్టాడు. ఆ  బాలికను పరామర్శించడానికి వెళ్లిన బిజెపి జాతీయ దళిత మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ బంగారు శృతిని ఎమ్మెల్యే బాలాల ‘థర్డ్ క్లాస్ వాలి’ అని దూషించాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బిజెపి దళిత నాయకులు తీవ్రంగా స్పందించారు.తనను బాలాల దూషించడంతో స్వయంగా బంగారు శృతి శనివారం చాదరఘాట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ….ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ జై భీమ్..జై మీమ్ అంటున్నాడు..కానీ వాళ్ళ పార్టీ నాయకులు దళితులను అత్యాచారం చేస్తున్నారు. మరో ఎమ్మెల్యే దూసిస్తున్నాడు. ఓవైసీ మాత్రం నోరు మెదపడం లేదు. ఇది అన్యాయమని అన్నారు.నన్ను దూషించిన ఎమ్మెల్యే బాలాల పై పోలీసులు ఎస్సీ, చెస్టీ కేసు నమోదు చేయాలి. లేకపోతే రాష్ట్రంలో భారీ ఎత్తున నిరసనలు చేపడుతాము. కేంద్ర ఎస్సీ, ఎస్టీ  కమిషన్ దృష్టికి తీసుకెళుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు భగవంత్ రావు, నర్సింహా, అలె జితేందర్, సురేందర్ రెడ్డి, కరుణా సాగర్, వినోద్ గౌడ్, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ముంపు బాధితులను ఆదుకుంటాం

Tags: The case should be registered against the MIM MLA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *