మంచిర్యాలలో ట్రాఫిక్ వ్యవస్థ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే

The caterpillar is where the traffic system is located
 Date:10/02/2019
అదిలాబాద్ ముచ్చట్లు:
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ వ్యవస్థ ఒక పద్మవూహంగా తయారైంది. ఎక్కడా వేసిన గొంగళి అక్కడే అన్నట్లు మంచిర్యాల జిల్లా కేంద్రంగా ఏర్పడినప్పటికి ట్రాఫిక్ వ్యవస్థ ఏలాంటి మార్పు లేకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మంచిర్యాల మార్కెటింగ్ వ్యవస్థ ఎక్కువ ఉన్నందున జిల్లా నలుమూలల నుండి క్రమ, విక్రయదారులు రోజుకు 10 వేల నుంచి 20 వేల మంది వస్తూపోతుంటారు. ఈక్రమంలో ట్రాఫిక్ వ్యవస్థ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.ముఖ్యమంగా బెల్లంపల్లి చౌరస్తా, స్టేషన్‌రోడ్డు, ఐ.బి.చౌరస్తా, వెంకటేశ్వర టాకీస్, ముఖారం చౌరస్తా, మంచిర్యాల ఫ్లుఓవర్ బ్రిడ్జి తదితర జిల్లా కేంద్రంలో ముఖ్యమైనటువంటి ఈ ప్రాంతంలో సిగ్నల్ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడంతో ప్రయాణీకులు నానా ఇక్కటుల పడుతున్నారు.
అక్కడ విధులు నిర్వహించే ట్రాఫిక్ కానిస్టేబుళ్లు సక్రమంగా విధులు నిర్వహించక పోవడం వలన వాహనదారులు ఇష్టం వచ్చినట్లు వాహనాలు నడుపుతున్నారు. మున్సిపల్ అధికారులు నిర్మించినటువంటి డివైడర్ వలన కూడా వాహనదారులు నానా ఇక్కట్లు పడుతున్నారు.బెల్లంపల్లి చౌరస్తా మొదలైన డివైడర్ వెంకటేశ్వర టాకీస్ వరకు ఏకధాటిగా ఉండడం, ఆదే దారిలో అగ్నిమాపక కేంద్రం ఉండడం, ఏదైనా ప్రమాదం సంబవించినప్పుడు అగ్నిమాపక యంత్రం సిగ్నల్ వ్యవస్థను దాటుకోని వెళ్లే సరికి జరుగాల్సిన నష్టం జరుగుతున్నది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రధానమైనటువంటి కూడలి వద్ద సిగ్నల్ వ్యవస్థ సరిగ్గా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
Tags:The caterpillar is where the traffic system is located

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *