జనగణమణ మార్చాల్సిందే

Date:02/12/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

జాతీయ గీతాన్ని మార్పు చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి లేఖ రాయడం చర్చనీయాంశమయ్యింది. జాతీయ గీతంలో అనవసరపు పదాలు ఉన్నాయని, దీనిని ఎవరిని ప్రశంసిస్తూ రాశారో అనే అనుమానాలను స్వామి వ్యక్తం చేశారు. దాని స్థానంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ నేతృత్వంలోని ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ 1943 అక్టోబరు 21న ఇంఫాల్‌ను స్వాధీనం చేసుకున్నప్పుడు ఆలపించిన గీతాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు.జాతీయ గీతం‘జనగనమణ’లోని ‘సింధు’ ప్రాంతం ఇప్పుడు పాక్‌‌లో ఉందని, దానిని తొలగించి ‘ఈశాన్యం’ అనే పదాన్ని జోడించాలంటూ 2019లో కాంగ్రెస్‌ ఎంపీ రిపున్‌ బోరా రాజ్యసభలో ప్రైవేటు బిల్లు ప్రవేశ పెట్టారని లేఖలో తెలిపారు. భవిష్యత్తులో ‘జనగనమణ’లోని అనవసరపు పదాలను తొలగించి, అవసరమైన వాటిని చేర్చి జాతీయ గీతాన్ని పునరుద్ధరిస్తామని 1949 నవంబరు 26న భారత తొలి రాష్ట్రపతి డాక్టర్‌ బాబూ రాజేంద్ర ప్రసాద్‌ అన్న విషయాన్ని గుర్తు చేశారు.కొత్త జాతీయ గీతాన్ని వచ్చే రిపబ్లిక్ దినోత్సవంలోపు రూపొందించాలని స్వామి తన లేఖలో సూచించారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన‘జనగణమణ’ను 1911 డిసెంబరు 27న కలకత్తా వేదికగా జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశంలో తొలిసారి ఆలపించారని సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు.

 

 

 

అందులోని ‘భారత భాగ్య విధాత’పదానికి బదులు 1943లో ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ ‘షుభ్‌ సుఖ్‌ చైన్‌’అనే పదాన్ని జోడించి ఆలపించింది. ఈ కొత్త జాతీయ గీతాన్ని బోస్‌ రచించగా కెప్టెన్‌ రామ్‌సింగ్‌ స్వరపరిచారని తెలిపారు. జాతీయ గీతాన్ని మార్చాలని డిమాండ్‌ తెరపైకి రావడం ఇదే తొలిసారి కాదు. కాంగ్రెస్ ఎంపీ రిపున్ బోరా 2019లో‌ ప్రయివేట్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు.‘ఈశాన్య భారతాన్ని జాతీయ గీతంలో ప్రస్తావించలేదు.. కానీ, ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న సింధ్‌ను కొనసాగిస్తున్నారు.. శత్రు దేశం స్థలాన్ని మనం ఎందుకు కీర్తిస్తున్నాం? దాన్ని కొనసాగించాల్సి అవసరం లేదు’ అని రిపున్ అన్నారు. కేంద్ర మంత్రి అరవింద్ సావంత్ సైతం 2016లో ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. సింధ్ పొరుగు దేశంలో ఒక భాగం అయినప్పటికీ, పాకిస్థాన్‌తో దానికి అనుబందం లేదని భారతదేశంలోని సింధీ సమాజం అసంతృప్తి వ్యక్తం చేసింది.

 ఫైజర్ టీకా రెడీ

Tags: The census has to change

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *