కాపు రిజర్వేషన్లకు కేంద్రం నో…

Date:15/02/2018
విజయవాడముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్‌లో తాము అధికారంలోకి వస్తే విద్య, ఉద్యోగాల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని 2014 ఎన్నికల్లో టీడీపీ వాగ్దానం చేసింది. దీనికి అనుగుణంగానే కాపు రిజర్వేషన్ బిల్లును డిసెంబరులో ఏపీ శాసనసభ ఆమోదించి, దానిని గవర్నర్‌కు పంపింది. నిబంధనల ప్రకారం గవర్నర్ ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. రాష్ట్రపతి ఆమోదం లభించిన తర్వాత ఈ అంశాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాల్సి ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తవు. రాజ్యాంగంలోని చేర్పించాల్సి ఇటువంటి బిల్లుల ఆమోదానికి ముందు, కేంద్ర హోంశాఖ సలహాలు, సూచనలను రాష్ట్రపతి తీసుకుంటారు.యథావిధిగా రాష్ట్రపతి ఏపీ ప్రభుత్వం పంపిన బిల్లును కూడా హోంశాఖకు పంపారు. ఆయన పంపిన బిల్లుపై శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) అభిప్రాయాన్ని హోంశాఖ కోరింది. ప్రధాని స్వయంగా పర్యవేక్షించే డీవోపీటీ కాపు రిజర్వేషన్ బిల్లును నిలిపివేయాలంటూ హోంశాఖకు సూచించింది. 1992 ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని డీవోపీటీ హోంశాఖకు స్పష్టం చేసింది. ఇందిరా సాహ్ని కేసులో 1992 నవంబరు 16 న 9 మంది సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెల్లడిస్తూ.. రాజ్యాంగం కల్పించిన మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని తెలిపింది. ఈ కేసును ఉదహరిస్తూ ఏపీ పంపిన బిల్లును నిలిపివేయాలని రాష్ట్రపతికి విన్నవించాలని హోంశాఖకు డీవోపీటీ సూచించింది.50 శాతానికి మించి రిజర్వేషన్ కోటాను ఏ ప్రాతిపదికన, ఎందుకు ఇవ్వాలో ప్రభుత్వం వివరణ ఇవ్వలేదనే ఒకే ఒక్క కారణంతో డీవోపీటీ ఈ నిర్ణయం తీసుకుంది. కాపులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించడానికి మంజునాథన్ కమిటీని ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు గత డిసెంబరులో ‘ఆంధ్రప్రదేశ్ కాపు రిజర్వేషన్ బిల్లు’ను శాసనసభ ఆమోదించింది.
Tags: The center for reservoir reservation is …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *