సినిమా థియేటర్లపై కేంద్రం కీలక నిర్ణయం

Date:04/06/2020

న్యూ ఢిల్లీ  ముచ్చట్లు:

కరోనా వైరస్‌ దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో దేశ వ్యాప్తంగా ఐదు దశ లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా సినిమా షూటింగ్‌లతో పాటు సినిమా థియేటర్లు సైతం మూతపడ్డాయి. ఇక థియేటర్లు తెరుచుకునే అంశంపై రోజుకో చర్చ కొనసాగుతోంది. అయినా ఇప్పటి వరకూ ఎలాంటి స్పష్టత రాలేదు. ఇక తాజాగా సినిమా థియేటర్లపై కేంద్రం స్పందించింది. థియేటర్లు తెరిచే అంశంపై జూన్‌ తర్వాత పరిశీలిస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ విషయం కేంద్ర సమాచారం శాఖ మంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ మీడియాతో మాట్లాడుతూ.. జూన్‌ నెలకు సంబంధించి కరోనా కేసుల సంఖ్యను, పరిస్థితుని పరిశీలించిన తర్వాతే సినిమా థియేటర్లకు ఎప్పుడు అనుమతి ఇస్తామనేది ప్రకటిస్తామని అన్నారు.  కాగా, కరోనా కారణంగా అన్ని రంగాలతో పాటు సినీ రంగం సైతం పూర్తిగా దెబ్బతింది. షూటింగ్‌, ఇతర షూటింగ్‌లు అన్ని కూడా నిలిచిపోయాయి. ఈ అంశంపై చిత్ర నిర్మాతలు, ఎగ్జిబీటర్లు, తదితర సంఘాలు ప్రభుత్వానికి ఇప్పటికే వినతి పత్రాలు సమర్పించారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ఆయా సంఘాల ప్రతినిధులతో సమావేశమై చర్చించారు. దేశంలో ఉన్న 9,500 సినిమా థియేటర్లలో కేవలం టికెట్ల అమ్మకంతోనే రోజుకు 30 కోట్లకుపైగా ఆదాయం వస్తుందని, లాక్‌డౌన్‌ కారణంగా ఇంత నష్టపోయినప్పటికీ లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకోవడం పై సినీ రంగంపై మంత్రి ప్రశంసించారు.చిత్ర నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించడం సంబంధించి విధివిధానాలు ఇప్పటికే ప్రభుత్వం జారీ చేసిందన్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా లాక్‌డౌన్‌ నిబంధనలు దశలవారీగా అమలు చేస్తుందన్నారు. ఏది ఏమైనా లాక్‌డౌన్‌ కారణంగా సినిమా థియేటర్లు తెరుచుకునేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రైతులు యంత్రాలు ద్వారా విత్తనాలు వేసుకోవాలి

Tags: The center is a key decision on movie theaters

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *